ఢిల్లీ: ఒక పోస్ట్. ఒకే ఒక్క పోస్ట్ తో అభిమానులు, నెటిజన్ల అభిమానాన్ని చూరుగొన్నారు వీరేందర్ సెహ్వాగ్. పుల్వామా దాడి గురించి మనందరికీ తెలిసిందే. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు..సెహ్వాగ్ తన అంతర్జాతీయ క్రికెట్ స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తన అభిమానులతో సెహ్వాగ్ పంచుకున్నారు. పుల్వామాలో వీర మరణం పొందినవారి పిల్లలు క్రికెట్‌ శిక్షణ తీసుకుంటున్న పోటోలు ట్విటర్ లో పోస్ట్ చేశారు సెహ్వాగ్. అంతే..అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు.

“నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. వీరు భారత అమర వీరుల పిల్లలు. బ్యాటింగ్ చేస్తుంది… పుల్వామా అమర్ జవాన్ రామ్ వకీల్ కుమారుడు, బౌలింగ్ చేస్తుంది.. రాహుల్ . ఇతను పుల్వామా అమర వీరుడు విజయ్ కుమారుడు.” సెహ్వాగ్ చేసిన ఈ ట్విట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "ఇంతకంటే భాగ్యం ఏమైనా ఉంటుందా.?"

Comments are closed.