బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 5:51 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. కొద్ది రోజుల క్రితం పట్టుబడిన ఉగ్రవాదుల నుండి సేకరించిన జాబితాలో రాజాసింగ్ పేరు ఉన్నట్లు సమాచారం అందింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజాసింగ్‌ ఇంటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

గతంలో మాదిరిగా టు వీలర్ వాహనంపై తిరుగవద్దంటూ రాజసింగ్‌కు పోలీసులు తెలిపారు.

ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని ఎమ్మెల్యేకు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ సూచించారు. డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజా సింగ్‌ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తన భద్రత పెంపు అంశంపై రాజాసింగ్‌ స్పందించారు. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రులకు లేఖ రాస్తానని రాజా సింగ్‌ తెలిపారు.

Next Story