సికింద్రాబాద్ లో భారీ వ‌ర్షం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 30 Sept 2019 2:28 PM IST

సికింద్రాబాద్ లో భారీ వ‌ర్షం

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తుంది. తాడ్‌బండ్, బోయిన్‌పల్లి ఏరియాల‌లో వర్షానికి కిలో మీటర్ మేర వాహనాలు ట్రాఫిక్ లో నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేయ‌డానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలావుంటే.. నగరానికి భారీ వర్ష సూచన ఉందని పోలీసులు నిన్న‌నే హెచ్చరికలు జారీ చేశారు. బయట ప్రాంతాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని సీపీ అంజనీకుమార్ అన్నారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Next Story