రెండోసారి కరోనా నిర్దారణ పరీక్ష.. ఆశ్చర్యపోయిన ట్రంప్..!
By Newsmeter.Network Published on 3 April 2020 5:40 AM GMTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 2లక్షల36వేలకుపైగా కేసులు నమోదు కాగా, దాదాపు 6వేల మంది మృత్యువాత పడ్డారు. గురువారం ఒక్క రోజే 900పైగా మంది మరణించడం గమనార్హం. ఈ దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే ఒకసారి పరీక్షలు చేయించుకున్న ట్రంప్‌కు.. పాజిటివ్ అని వచ్చింది. తాజాగా రెండవ సారి ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం.. ఎందుకంటే..?
గత నెలలో ట్రంప్‌తో చర్చలు నిర్వహించిన బ్రెజిల్ ప్రతినిధి బృంధానికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వారితో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ నెగిటివ్ వచ్చినట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు సీన్ పి కాన్‌లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫలితాలను ఇచ్చే అబాట్ లాబరేటరీ ప్రవేశపెట్టిన నూతన పద్దతి ద్వారా ట్రంప్ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. నా అత్రుతను పక్కన పెట్టి, అది అంత త్వరగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుందని పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను మరో నాలుగు వారాలు పొడగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడతామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.