గవర్నర్ తో ముగిసిన ఎస్ఈసీ భేటీ
By రాణి
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం..రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులను ఆయన గవర్నర్ కు వివరించారు. రాష్ర్టంలో కరోనా వ్యాప్తితో పాటు..స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలుచోట్ల చోటుచేసుకున్న హింసాత్మకమైన ఘటనలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందే గవర్నర్ ను కలిసి సీఎం జగన్..సీఎస్ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సీఎస్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న భయంతోనే ఎన్నికలను వాయిదా వేశారంటూ ఆరోపించారు.
Also Read : ఇటలీలో వైరస్ వ్యాప్తికి అసలు కారణమేంటి ?
అలాగే ఆదివారం సీఎస్ రమేష్ కుమార్ తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఎస్ఈసీకి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆమె ఈసీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేదని నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు.
Also Read : తెలంగాణలో మరో కరోనా కేసు..ఇప్పటికీ మూడు కేసులు