ఇటలీలో వైరస్ వ్యాప్తికి అసలు కారణమేంటి ?

By రాణి  Published on  16 March 2020 5:23 AM GMT
ఇటలీలో వైరస్ వ్యాప్తికి అసలు కారణమేంటి ?

చైనా వెలుపల కరోనా వైరస్ బాధితులు, కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ. జనవరి 29 నుంచి మార్చి 15 వరకూ ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 2 నుంచి 21,157 కు పెరగడం..అక్కడి ప్రజలు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో కరోనా వైరస్ ఉన్నప్పటి నుంచి ఇటలీ ప్రయాణాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశంలో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తించడం వెనుక అసలు కారణమేమిటో..ఎవరికి అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయిది. దీనిపై శాస్ర్తవేత్తలు, వైద్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ..ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలీదు కానీ..కరోనా మరణమృదంగం మాత్రం మోగుతూనే ఉంది.

Also Read : ఇజ్రాయెల్‌లో కరోనా ఎఫెక్ట్

అసలు ఇంత వేగంగా వైరస్ ఎందుకు, ఎలా వ్యాపించిందన్న దానిపై శాస్ర్తవేత్తలు భిన్నంగా వాదిస్తున్నారు. జనవరి నెల మధ్య నుంచే కరోనా వైరస్ ఇటలీలోకి వచ్చినా..అప్పట్లో వైరస్ తీవ్రతకు చనిపోయేంత ప్రభావం లేదని చెబుతున్నారు. స్వల్ప దగ్గు, లో ఫీవర్ ఉండగా..వాటికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వారికి వైద్యులు సాధారణమైన ఫ్లూ, జ్వరంగా భావించి వైరస్ తీవ్రతను గుర్తించడంలో నిర్లక్ష్యం చేసి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఈ వైరస్ క్రమంగా వ్యాప్తి చెంది ఉంటుందని బెర్న్ యూనివర్శిటీ వైరల్ డిసీస్ నిపుణులు క్రిస్టియన్ ఆల్తస్ పేర్కొన్నారు. జనవరి నెలలో ఇటలీలోని ఆస్పత్రుల్లో న్యుమోనియా కేసులు కుప్పలు తెప్పలుగా నమోదయ్యాయని, ఈ రోగులకు కరోనా పరీక్షలు చేయడంలో వైద్యుల వైఫల్యం కూడా వైరస్ విచ్చిలవిడి వ్యాప్తికి మరో కారణం అయి ఉండవచ్చని మరో శాస్ర్తవేత్త నినో బాక్టబెల్లోట్ట తెలిపారు.

మరీ ఇంత వేగమా..

జనవరి 29వ తేదీన ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలుండటంతో..వైద్యులు పరీక్షలు చేయగా..ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. వారిద్దరినీ ఐసోలేట్ చేసి, ఆరునెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇటలీ ప్రభుత్వం. అయినప్పటికీ ఫిబ్రవరి 21కి ఈ కేసుల సంఖ్య 4కు పెరిగింది. ఫిబ్రవరి 23 నాటికి ఏకంగా 79 కేసులు నమోదయ్యాయి. అంటే రెండ్రోజుల వ్యవధిలో 75 మంది కరోనా బారిన పడ్డారు. మార్చి 1కి 1577, మార్చి 8కి 7375, మార్చి 2కి 12,462, మార్చి 15 నాటికి 21,157 కరోనా కేసులు నమోదవ్వగా..1441 మంది మరణించారు. ఇప్పటి వరకూ ఒక్కరు కూడా కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన దాఖలాలైతే కనిపించలేదు.

Also Read : కరోనా పరిణామాలు.. ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు..

రెండు కేసుల నమోదయ్యాక..మరో వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చినా..అతడికి వైద్యులు మొదట కరోనా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటికి వెళ్లేందుకు అనుమతించారని, తద్వారా ఆ రోగి ఈ వైరస్ విపరీతంగా వ్యాపించేందుకు ప్రధాన కారణమయ్యాడని చెప్తున్నారు. ఫిబ్రవరి 23న రెండు కరోనా మరణాలు నమోదవ్వడంతో..కొడగ్నోతో సహా 10 పట్టణాలలో ప్రజలను దిగ్భంధించారు. ఆ దేశ రాజధాని అయిన మిలన్ లో కూడా నియంత్రణలు విధించారు. దాదాపు 1.60 కోట్ల మందిని ఇళ్లకే పరిమితవ్వాల్సిందిగా ఆంక్షలు విధించారు. చైనాలో కూడా లేని ఆంక్షలను ఇటలీలో విధించడం ద్వారా..కంటికి కనిపించని శత్రువుపై ఇటలీ ప్రత్యక్ష యుద్ధమే చేస్తుందని చెప్పాలి. కానీ ఏం లాభం..జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లోబార్డీ నగరానికి చెందిన ప్రజలు అక్కడి ఆస్పత్రులకు క్యూ కట్టారు. వారిలో దాదాపు కరోనా లక్షణాలతో ఉన్నవారే ఎక్కువ. అలా ఇటలీలో జనవరి నెలాఖరు నుంచి మార్చి మధ్య వరకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

Also Read : బ్రిటన్ మహారాణికి తప్పని జాగ్రత్తలు

అక్కడ వైరస్ బాధితులు పెరగడానికి మరో కారణం..వృద్ధులు ఎక్కువగా ఉండటం. ఇటలీ జనాభా 6.10 కోట్ల మంది కాగా..వారిలో 22.6 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారే. వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి..ఈ వైరస్ వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. అక్కడ కరోనా మరణాల్లో ఎక్కువమంది వృద్ధులేనని డాక్టర్ కార్టబెల్లొట్ట పేర్కొన్నారు.

Next Story