ఇజ్రాయెల్‌లో కరోనా ఎఫెక్ట్

By అంజి  Published on  16 March 2020 4:32 AM GMT
ఇజ్రాయెల్‌లో కరోనా ఎఫెక్ట్

కరోనాను అరికట్టేందుకు ఉగ్రవాదులను పసిగట్టేందుకు వాడే సాంకేతికను ఉపయోగించనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటుండగా.. ప్రజలలో కరోనా లక్షణాలను గుర్తించేందుకు సైబర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తాం అన్నారు బెంజిమన్. అంతే కాదు కరోనా వ్యాప్తి తగ్గేవరకు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక విశ్రాంతి ఇవ్వనున్నారు.

కరోనా నిర్మూలనలో భాగంగా ఆదివారం నుంచి అన్ని మాల్స్‌, రెస్టారెంట్లు, థియేటర్స్‌ మూసివేయనున్నట్లు తెలిపారు. అవసరమనుకుంటే తప్ప ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లవద్దని కోరారు. అయితే ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడే పార్మసీ, సూపర్‌మార్కెట్‌, బ్యాంక్‌లు ఎదావిదిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయని అన్నారు. కాగా, ప్రజలెవరూ గుంపులుగా ఉండొద్దని, ఒక రూంలో కేవలం పది మంది వరకే ఉండాలని అక్కడి వైద్య అధికారులు సూచిస్తున్నారు.

Also Read: కరోనాపై యుద్ధం.. నడుంబిగించిన సార్క్‌ దేశాలు..

కరోనా విస్తృతిని అరికట్టేందుకు ఇజ్రాయిల్‌ న్యాయమంత్రిత్వశాఖ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అవినీతి కేసు విచారణ రెండు నెలలు వాయిదా పడింది. జెరూసలేం జిల్లా కోర్టులో మంగళవారం ప్రారంభం కావాల్సిన ఈ విచారణ మే 24 వరకూ చేపట్టే పరిస్థితి లేనందున, వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతకు ముందు ఈ కేసు విచారణను 45 రోజుల పాటు వాయిదా వేయాలని నెతన్యాహూ తరపు న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దేశంలోని కరోనా పేషెంట్ల సెల్‌ఫోన్లపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్‌ స్టేట్‌ సర్వేలెన్స్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు దేశ అటార్నీ జనరల్‌ అవిచారు మెండెల్‌బ్లిట్‌ ఆదివారం జరిగిన కోర్టు విచారణలో అంగీకరించారు.

Also Read: బ్రిటన్ మహారాణికి తప్పని జాగ్రత్తలు

Next Story