స్కూటర్ ఇంజిన్ తో పొలం దున్నే యంత్రం... అద్భుతం కదూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Sep 2019 1:26 PM GMT
స్కూటర్ ఇంజిన్ తో పొలం దున్నే యంత్రం... అద్భుతం కదూ..!

నల్లగొండ: గుద్రంపల్లి గ్రామానికి చెందిన రాచకొండ లింగస్వామి స్కూటర్ ఇంజిన్ ను వాడి ఒక అద్భుతమైన పొలం దున్నే పరికరాన్ని కనుగొన్నాడు. చాలామంది రైతులకి పొలం దున్నడానికి ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చుకోవడం పెద్ద సమస్య. దాని ఖరీదు పెట్టలేక, కొంతమంది ఎద్దుల సహాయంతోనో, అవి కూడా లేనివారు తామే నడుం బిగించి దున్నుకుంటారు.

అయితే, రైతుల బాధలు చూడలేని లింగస్వామి, వారి కష్టాలు పోగొట్టాలని పట్టుదలతో తక్కువ ధరలో వచ్చే ఈ యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ పరికరం పది నుంచి పదిహేను వేల లోపే లభిస్తుంది. అయితే ..అతని ఆశయం పరికరాన్ని తయారు చేయడమే కాదు. ఇలాంటివి ఎన్నో తయారు చేసి పేద రైతులకు ఉచితంగా అందజేయడం.

Scooter Engine plough Lingaswamy

న్యూస్ మీటర్ తో లింగస్వామి మాట్లాడుతూ, " రోజుకు ఒక గంట చొప్పున పని చేస్తూ 15 రోజుల్లో ఒక యంత్రాన్ని తయారు చేశాను. స్నేహితుడి పాత స్కూటర్ ఇంజిన్ ను తీసుకొని ఇనుప చక్రాలను వాడి దున్నె యంత్రం తయారీ మొదలు పెట్టాను. మొదట ఎన్నో సమస్యలు తలెత్తినా తరువాత విజయం సాధించాను" అని చెప్పాడు.

లింగస్వామి ప్రైవేటు కంపెనీ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు. ప్రభుత్వ సహాయంతో స్వగ్రామంలో చిన్న కర్మాగారం నెలకొల్పాలనేది అతని ధ్యేయం. స్వాతంత్ర దినొత్సవం సందర్భంగా...నల్గొండ జిల్ల కలెక్టర్ శ్రీ గౌరవ్ ఉప్పల్, లింగస్వామి అవిష్కారాన్ని ఎంతో మెచ్చుకొని అతనికి ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు లింగస్వామి.

Scooter Engine plough Lingaswamy

తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణల విభాగం వారు చేసిన #ruralinnovator అంటూ చేసిన ట్వీట్ వల్ల లింగస్వామి గురించి లోకానికి తెలిసింది. ఇలాంటి ప్రతిభావంతులను వెలికితీసి వారికి తగినంత సహాయం అందించినప్పుడు దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తాయి.

Next Story