మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా?.. అయితే ఇది మీ కోసమే

వీడియో ఎడిటింగ్​ యాప్​ను లాంచ్​ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం యూట్యూబ్​. దీని పేరు యూట్యూబ్​ క్రియేట్​.

By అంజి  Published on  22 Sep 2023 6:51 AM GMT
YouTube, AI editing app, YouTube Create, Technology News

మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా?.. అయితే ఇది మీ కోసమే

యూట్యూబర్స్‌.. తమ తమ యూట్యూబ్‌ ఛానెల్స్‌లలో వీడియో అప్‌లోడ్‌ చేయడానికి ముందు ఎడిటింగ్‌ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే వీడియో ఎడిటింగ్‌కు చెక్‌పెట్టేసింది వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌. తాజాగా యూట్యూబ.. ఓ వీడియో ఎడిటింగ్‌ యాప్‌ని లాంచ్‌ చేసింది. ఈ యాప్‌ పేరు యూట్యూబ్‌ క్రియేట్. భారత్‌, యూకే , ఫ్రాన్స్‌, సౌత్‌ కొరియా, సింగపూర్‌లో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత యాప్‌నకు చెందిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ని రిలీజ్‌ చేసింది. 2024వ సంవత్సరం కల్లా ఇది ఐఓఎస్‌కు అందుబాటులోకి రానుంది. ఇతర దేశాల్లో కూడా తర్వలో లాంచ్‌ కానుంది. గురువారం నాడు మేడ్‌ ఆన్‌ యూట్యూబ్‌ ఈవెంట్‌లో ఈ యూట్యూబ్‌ క్రియేట్‌ యాప్‌ని లాంచ్‌ చేశారు. సులభంగా వీడియో ఎడిటింగ్​ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాప్​ను తీసుకొచ్చినట్టు యూట్యూబ్‌ వెల్లడించింది.

''ఎవరైనా వీడియోలను సృష్టించడానికి లేదా షేర్‌ చేయడానికి' ఒక బిడ్‌లో కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ యూట్యూబ్‌ క్రియేట్‌ని ప్రకటించింది. గురువారం మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్‌లో ప్రకటించబడింది. ఈ యాప్ ప్రస్తుతం భారతదేశం, యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, యుకె, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా ఎంపిక చేసిన దేశాలలో ఆండ్రాయిడ్‌లో బీటాలో ఉంది, అయితే iOS సపోర్ట్‌ 2024లో అందించబడుతుంది'' అని యూట్యూబ్‌ పేర్కొంది.

''వీడియోలు తయారు చేయడం వెనుక ఉండే కష్టం గురించి మాకు తెలుసు. మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌ ఛానెల్స్‌ని ప్రారంభిస్తున్న వారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్​ ప్రక్రియను సులభతరం చేసేందుకే.. యూట్యూబ్​ క్రియేట్​ యాప్​ను తీసుకొచ్చాము. ఇదొక మొబైల్​ యాప్'' అని యూట్యూబ్‌ వెల్లడించింది. ఇదొక ఉచిత యాప్​ అని, షార్ట్స్​, లాంగ్​ ఫార్మాట్​ వీడియోలను ఇందులో చేసుకోవచ్చని తెలిపింది. ఏడిటింగ్​, ట్రిమ్మింగ్​, ఆటోమెటిక్​ కాప్షనింగ్​, వాయిస్​ఓవర్​, ట్రాన్సీషన్స్​ వంటివి ఏఐ ఆధారంగా చేసుకోవచ్చు. బీట్​ మ్యాచింగ్​ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్​ని కూడా ఈ యూట్యూబ్​ క్రియేట్​లో పొందొచ్చు.

కొత్త యాప్‌ను రూపొందించడానికి దాదాపు 3,000 మంది క్రియేటర్‌ల నుండి ఫీడ్‌బ్యాక్‌ను ఉపయోగించినట్లు యూట్యూబ్ తెలిపింది. కాలక్రమేణా కొత్త ఫీచర్లు మరియు కార్యాచరణను జోడిస్తానని కంపెనీ హామీ ఇచ్చింది.

Next Story