మగజాతి మనుగడ ప్రమాదంలో పడింది. Y క్రోమోజోమ్స్ సంఖ్య తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. డీఎన్‌ఏలో భాగమైన క్రోమోజోమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్, మరొకటి వై క్రోమోజోమ్. మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటే.. మగవారిలో ఎక్స్, వై క్రోమో జోమ్‌లు ఉంటాయి. శిశువులు మగబిడ్డగా రూపొందడంలో ఈ వై క్రోమోజోమ్‌లు కీలకంగా వ్యవహరిస్తాయి. గర్భంలో శిశువు పురుడు పోసుకున్న 12 వారాల తర్వాత ఇవి పని చేయడం ప్రారంభిస్తాయి. ఇందులో మాస్టర్ జన్యువు.. శిశువులో జననేంద్రియాలు రూపొందేలా చేస్తుంది. టెస్టిస్ రూపొందగానే.. దీని ద్వారా మేల్ హర్మోన్‌లు ఉత్పత్తి అవుతాయి.
ఈ మాస్టర్ జన్యువుని ఎస్ ఆర్ వై అని కూడా పిలుస్తారు. ఇంత కీలకమైన వై క్రోమోజోమ్స్‌లో 166 మిలియన్ సంవత్సరాల క్రితం 900కు పైగా జన్యువులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 55కు పడిపోయింది. 10 లక్షల సంవత్సరాలకు 5 జన్యువుల చొప్పున అంతరిచిపోతున్నాయట. ఈ లెక్కన మరో 11 మిలియన్ సంవత్సరాల్లో మిగిలిన 55 జన్యువులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రోమోజోమ్స్ అంతరించిపోతే మగజాతి మనుగడ అంతరించిపోతుందని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో కొత్త జన్యువు అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.