వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. టెక్ట్స్ రూపంలో వాయిస్ మెసేజ్

వాట్సాప్‌లో మరో అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది.

By Srikanth Gundamalla  Published on  13 July 2024 1:28 AM GMT
whatsapp, new feature, voice,  text message,

 వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. టెక్ట్స్ రూపంలో వాయిస్ మెసేజ్

వాట్సాప్‌లో మరో అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది.ఇప్పటికే మెటా ఏఐ వాట్సాప్‌లో అందరినీ ఆకర్షిస్తోంది. ఎలాంటి సమాచారాన్ని అయినా వాట్సాప్‌లో మెసేజ్ ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే.. వాట్సాప్‌ ఇప్పుడు తన యూజర్ల కోసం అప్‌డేటెడ్‌ ఫీచర్‌ తీసుకురాబోతుంది. చాలా మంది రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారు. వాట్సాప్‌లో కొన్ని వాయిస్‌ మెసేజ్‌లు వస్తాయి. ఆ సమయంలో వారి వద్ద ఇయర్‌ఫోన్స్‌ లేకపోవడం వల్ల వినలేకపోతుంటారు. ఇలాంటి వారి కోసమే కొత్త ఫీచర్‌ ఉపయోగపడనుంది. వాయిస్‌గా వచ్చిన ఆడియోను మేసేజ్‌లోకి కన్వర్ట్‌ చేసే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. టెక్ట్స్‌ రూపంలో వాయిస్‌ మెసేజ్‌ చూపే ట్రాన్స్‌ స్క్రిప్షన్ ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ప్రస్తుతం దాన్ని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంచింది.

అనునిత్యం వాట్సాప్ అప్ డేట్స్ అందించే వాబీటా ఇన్పో.. ఈ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ ను రెడీ చేసింది. వాయిస్ మెసేజ్ వచ్చినా, పంపినా దాని కింద కనిపించే ట్రాన్స్ స్క్రిప్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. ఆ మెసేజ్ సారాంశం టెక్ట్స్ రూపంలో కనిపించనుంది. అయితే ఇదేమీ ట్రాన్స్ లేటర్ కాదు. వాయిస్ మెసేజ్ భాషలోనే టెక్ట్స్ మెసేజ్ వస్తుంది. ఇప్పటికైతే ఇంగ్లిష్, హిందీ, పోర్చుగస్, రష్యన్, స్పానిష్ భాషలకు సపోర్టుగా వాయిస్‌ ట్రాన్స్‌ స్క్రిప్షన్‌ పనిచేస్తుంది. ఇతర భాషల్లోకి ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.

Next Story