బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సీఏ/సీఎస్/సీఎఫ్‌ఏ/ సీఎంఏ ఉతీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అరఱభ్యర్థులు రూ.600తో పాటు ఇతర ఛార్జీలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
తతఅభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, సైకో మెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారార ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ పరీక్షలో 150 ప్రశ్నలకుగానూ 225 మార్కులు కేటాయించారు. రీజనింగ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), ప్రొపెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు 150 మార్కులు) ఉంటుంది. పరీక్షా సమయం 2.30 గంటలు. పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ ను సంప్రదించండి.