ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ బైక్ వచ్చేసింది.!

The world's first flying bike debuted at the US Auto Show. ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్‌ బైక్‌ వచ్చేసింది. గురువారం నాడు డెట్రాయిట్‌ ఆటో షో యునైటెడ్‌ స్టేట్స్‌లో ప్రారంభమైంది.

By అంజి  Published on  16 Sep 2022 11:45 AM GMT
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ బైక్ వచ్చేసింది.!

ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్‌ బైక్‌ వచ్చేసింది. గురువారం నాడు డెట్రాయిట్‌ ఆటో షో యునైటెడ్‌ స్టేట్స్‌లో ప్రారంభమైంది. ఈ షోలో జపనీస్‌ స్టార్టప్‌ ఏర్‌విన్స్‌ టెక్నాలజీస్‌ తయారు చేసిన ఫ్లయింగ్‌ బైక్‌ సందడి చేసింది. తయారీదారులు వచ్చే ఏడాది ఈ మోడల్‌ బైక్‌లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎగిరే బైక్‌కు XTURISMO హోవర్‌బైక్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా పేర్కొనబడిన ఈ ఎక్స్‌రిస్మో హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ బైక్‌లను తలపిస్తోంది.

హోవ‌ర్‌బైక్ గరిష్ఠంగా గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగంతో 40 నిమిషాల పాటు ప్ర‌యాణించగలదు. జపాన్‌లో ఈ ఫ్లయింగ్ బైక్ ఇప్పటికే అమ్మకానికి ఉంది. ఏర్‌విన్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో షుహి కొమట్సు మాట్లాడుతూ.. తమ కంపెనీ 2023లో అమెరికాలో ఈ బైక్‌ స్మాలర్‌ వెర్షన్‌ను విక్రయించాలని యోచిస్తోందని తెలిపారు. ఈ హోవర్‌బైక్‌ ధర భారత కరెన్సీలో రూ.6 కోట్లు. అయితే చిన్న ఎల‌క్ట్రిక్ మోడ‌ల్ ధ‌ర‌ను త‌క్కువ ధ‌ర‌కు అందిస్తామ‌ని కంపెనీ సీఈవో తెలిపారు. ఇందుకు రెండు, మూడు సంవత్సరాలు పడుతుందన్నారు. 2025 నాటికి ఈ బైక్‌లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు.

డెట్రాయిట్ ఆటో షో కో-చైర్ థాడ్ స్జోట్.. హోవర్‌బైక్‌ను టెస్ట్ రైడ్‌ చేశారు. ఈ హోవర్‌బైక్‌ను నడపడం చాలా సౌకర్యవంతంగా, ఉల్లాసంగా ఉందని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ నుండి వచ్చినట్లు అనిపించిందని అన్నారు. తాను 15 ఏండ్ల బాలుడిలా ఫీల్ అయ్యాన‌ని, తాను స్టార్ వార్స్‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి వారి బైక్‌పై జంప్ చేసిన‌ట్టు అనిపించింద‌ని థాడ్ స్జోట్ చెప్పారు.


Next Story