రోబోకు మనిషి చర్మం

Scientists grew Human Skin on sweaty robotic fingers.రోబోలను అచ్చం మనుషుల్లా తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 11:07 AM GMT
రోబోకు మనిషి చర్మం

రోబోలను అచ్చం మనుషుల్లా తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. రోబోలకు సిలికాన్‌ రబ్బరు పొరను ఉంచుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు రోబోల ఉపరితలం మీద మనిషి చర్మాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో విజయం సాధించారు. ప్లాస్టిక్‌ రోబో వేలును మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయి, మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. దీన్ని కెరటినోసైట్లనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పై పొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదులుతున్నప్పుడు చెక్కు చెదరలేదు. ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం అయింది. అయితే రక్తనాళాలు లేకపోవటం వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోయింది. చర్మం తేమగా ఉండటానికి భవిష్యత్తులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ వేలు కొద్దిగా 'చెమట' తో నిండి ఉందని చెప్పారు. "వేలు ఎలక్ట్రిక్ మోటారు ద్వారా నడపబడుతుంది కాబట్టి, నిజమైన వేలితో సమానంగా కనిపించే మోటారు యొక్క క్లిక్ శబ్దాలను వినడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది." అని పరిశోధకులు తెలిపారు. అనేక పరిశోధనా బృందాలు రోబోలను మరింత మానవ-వాస్తవికంగా మార్చడానికి పని చేస్తున్నాయి. మరింత ఖచ్చితత్వంతో మానవునిగా కనిపించే రోబోట్‌ల లక్ష్యం దిశగా పురోగతి ఇప్పుడే పెద్ద అడుగు పడిందని ఈ పరిశోధన తెలియజేస్తుంది.

Next Story