రెడ్‌మీ 10 వ‌చ్చేసింది.. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో.. ధ‌ర ఎంతంటే

Redmi 10 smartphone launched at Rs 10,999 onwards.జియోమీ రెడ్‌మీ సిరీస్ భార‌త్‌లో సూప‌ర్ స‌క్సెస్ అయింది. రెడ్‌మీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 5:39 AM GMT
రెడ్‌మీ 10 వ‌చ్చేసింది.. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో.. ధ‌ర ఎంతంటే

జియోమీ రెడ్‌మీ సిరీస్ భార‌త్‌లో సూప‌ర్ స‌క్సెస్ అయింది. రెడ్‌మీ సిరీస్ ఫోన్ల‌ను ఎక్కువ శాతం జ‌నాలు కొనుగోలు చేశారు. దీంతో జియోమీకి భార‌త్‌లో మంచి మార్కెట్ ఏర్ప‌డింది. అందుకే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తూ.. స‌రికొత్త మోడ‌ల్స్‌ను జియోమీ విప‌ణిలోకి తెస్తోంది. ఈసారి స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ 10 మోడ‌ల్‌ను తీసుకువ‌చ్చింది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉండ‌గా.. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ మోడల్స్‌లో ఉండటం గ‌మ‌నార్హం.

రెడ్ మీ 10 ప్రారంభ ధ‌ర రూ.10,999 గా ఉంది. రెండు వేరియంట్ల‌లో మూడు క‌ల‌ర్ల(కరేబియన్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ మరియు పసిఫిక్ బ్లూ కలర్ )లో రెడ్‌మీ 10 ల‌భిస్తోంది. రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా.. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌తో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవ‌చ్చు. మార్చి 24న రెడ్‌మీ 10 సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, ఎంఐ.కామ్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 6.71 హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ ఉంది. 2జీబీ ర్యామ్‌ను 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా. రియర్ కెమెరాలో పోర్ట్‌రైట్ కెమెరా, మూవీ ఫ్రేమ్, కెలిడియోస్కోప్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 6,000ఎంఏహెచ్. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆఫ్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.


Next Story