మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?.. దీని అర్థం ఇదే
'మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?'.. వచ్చే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇవాళ చాలా మంది యూజర్లకు గురువారం ఉదయం 11.41 గంటల సమయంలో అలర్ట్ వచ్చింది.
By అంజి Published on 21 Sep 2023 6:42 AM GMTమీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?.. దీని అర్థం ఇదే
'మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా?'.. వచ్చే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇవాళ చాలా మంది యూజర్లకు గురువారం ఉదయం 11.41 గంటల సమయంలో, అలాగే మధ్నాహ్నం 12.04 గంటల సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చాయి. అనేక స్మార్ట్‌ఫోన్‌లలో టెస్ట్ ఫ్లాష్‌ను పంపడం ద్వారా భారత్ ఈ రోజు తన అత్యవసర హెచ్చరిక వ్యవస్థను పరీక్షించింది. ఎమర్జెన్సీ అలర్ట్ పేరుతో అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో ఆ అలర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక చాలా మంది గందరగోళానికి గురయ్యారు. అయితే ఆ అలర్ట్‌ను పంపింది కేంద్ర ప్రభుత్వమే. అలర్ట్‌తో పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ సందేశం వచ్చినట్టు తెలిసింది.
‘Emergency alert: Severe’ పేరుతో వచ్చిన ఈ సందేశంలో.. ‘‘టెలికమ్యూనికేషన్ విభాగానికి (Department of Telecommunication) చెందిన సెల్ బ్రాడ్‌కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. దీన్ని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’’ అని రాసి ఉంది.
మొబైల్ ఆపరేటర్లు, సెల్ ప్రసార వ్యవస్థల యొక్క అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం, ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించబడతాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మెరుగైన సన్నద్ధత కోసం ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. భారతదేశంలోని ఫోన్ వినియోగదారులకు జూలై 20, ఆగస్టు 17న ఇలాంటి పరీక్ష హెచ్చరికలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి.