ఆ లింక్‌లు క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ హ్యాక్‌!

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. ఈ స్కామ్‌పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

By -  అంజి
Published on : 5 Jan 2026 7:14 AM IST

Police officials, WhatsApp hacking, Cyber Crime

ఆ లింక్‌లు క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ హ్యాక్‌!

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. ఈ స్కామ్‌పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. 'మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అకౌంట్‌ నుంచి ఫొటో లేదా వీడియో పంపిస్తారు. దానిని ఓపెన్ చేయగానే మీ అకౌంట్‌ హ్యాక్‌ అవుతుంది. ఎవరు పంపించినా సరే అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయకూడదు'' అని చెప్పారు. టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆన్‌ చేసి పెట్టుకుని, లింక్డ్‌ డివైజెస్‌ను తరచూ చెక్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్‌లో 'ఘోస్ట్ పేయిరింగ్' పేరిట కొత్త స్కామ్‌ జరుగుతోందని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. '' "హేయ్.. మీ ఫొటో చూశారా?" అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి. ఇదొక 'ఘోస్ట్ పేయిరింగ్' (GhostPairing) స్కామ్. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే నకిలీ వాట్సాప్‌ వెబ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్‌ చేస్తారు'' అని సజ్జనార్‌ హెచ్చరించారు.

అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్‌ చేయవద్దు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్‌ చేయండి. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్‌ మొత్తం హ్యాకర్ల పరమవుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి.

Next Story