ఇంటర్నెట్‌ సొల్యూషన్స్‌ విడుదల చేసిన ఆన్‌పాసివ్‌

Onpassive Globally Launches Its First Set of Disruptive Solutions. దుబాయ్‌- యునైటెడ్‌ అరబ్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌లో ప్రధాన కార్యాలయంతో పాటుగా భారతదేశంలోని

By అంజి  Published on  24 Nov 2022 1:06 PM GMT
ఇంటర్నెట్‌ సొల్యూషన్స్‌ విడుదల చేసిన ఆన్‌పాసివ్‌

దుబాయ్‌- యునైటెడ్‌ అరబ్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌లో ప్రధాన కార్యాలయంతో పాటుగా భారతదేశంలోని హైదరాబాద్‌లో సాంకేతక కేంద్రం కలిగిన ఆన్‌పాసివ్‌.. బిజినెస్‌ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌ అండ్‌ విప్లవాత్మక ఇంటిలిజెన్స్‌ సేవలను అంతర్జాతీయంగా అందిస్తోంది. తాజాగా ఆన్‌పాసివ్‌ తమ వినూత్నమైన ఇంటర్నెట్‌ సొల్యూషన్స్‌ విడుదల చేసి ప్రజలకు మరింత దగ్గరైంది. ఆన్‌పాసివ్‌ తాజాగా విడుదల చేసిన వినూత్నమైన ఇంటర్నెట్‌ పరిష్కారాలలో ఈ-మెయిలింగ్‌ పరిష్కారాల కోసం ఓ-మెయిల్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌కు తోడ్పడేందుకు ఓ-నెట్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ కోసం ఓ - కనెక్ట్‌ ఉన్నాయి.

గ్లోబల్ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఐటీ కంపెనీ ఆన్‌పాసివ్‌.. తమ ప్రతి యూజర్‌కు ఉన్నతమైన అనుభవాన్ని అందించడానికి కొన్ని పరిష్కారాలను ఆవిష్కరించింది. భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికీ సమర్థవంతమైన, ప్రభావవంతమైన కమ్యూనికేషన్స్‌ కోసం ఓ-నెట్‌, ఓ-మెయిల్‌ సేవలను పూర్తి ఉచితంగా అందించనుంది ఆన్‌పాసివ్‌. ఈ ఆవిష్కరణతో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేకుండా ఉన్న ఇంటర్నెట్‌ సేవలను గణనీయంగా మార్చడంతో పాటుగా ఏఐ (కృత్రిమ మేథస్సు) ద్వారా ప్రపంచవ్యాప్తంగా చివరి యూజర్ల కోసం కనెక్టివిటీని మెరుగుపరచడానికి, వృద్ధి చేయడానికి విప్లవాత్మక సాంకేతికతను తీసుకువస్తోంది.

ఆన్‌పాసివ్‌ ఫౌండర్‌, సీఈఓ ఆష్‌ ముఫారెహ్‌ మాట్లాడుతూ.. ''ఆన్‌పాసివ్‌ దూర దృష్టి లక్ష్యాలు మానవాళికి మద్దతు అందించే, మెరుగుపరిచే స్ధిరమైన పర్యావరణ వ్యవస్థను మీకు అందిస్తాయి. వినియోగదారులకు సౌకర్యవంతమైన పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించడానికి మేము లక్ష్యంగా చేసుకున్నాము. వినియోగదారులకు అత్యంత అనుకూలమైన సాంకేతికతతో డిజిటల్‌ రంగానికి పునరాకృతి కల్పించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము'' అని ఆన్నారు.

వీడియో ఈ-మెయిల్స్‌, వాయిస్‌ ఈ-మెయిల్స్‌, ఫోల్డర్స్‌ ప్రైవసీ లాక్‌, టెక్ట్స్‌ నుంచి వాయిస్‌ వంటి అద్భుతమైన ఫీచర్లు ఓ - మెయిల్‌లో ఉన్నాయి. ఈ సొల్యూషన్‌ను విడుదల చేయడం ఇది తొలిసారి. ఇక ఆన్‌పాసివ్‌ అందిస్తోన్న మరో సోల్యూషన్‌ ఓ-నెట్‌. దీనిని కూడా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిలో కూడా వినూత్నమైన, ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల అంచనాలను మించి దీని డ్యాష్‌బోర్డ్‌ ఉన్న కారణంగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో గేమ్‌ ఛేంజర్‌గా ఓ-కనెక్ట్‌ మారబోతుంది. ఈ ఓ-కనెక్ట్‌ సొల్యూషన్‌ ప్రస్తుతం మార్కెట్‌లో మీకు లభిస్తున్న వీడియో కాన్ఫరెన్సింగ్‌ అనుభవాలను మించి మీకు పూర్తి సరికొత్త అనుభవాలను అందిస్తుంది. గతంలో ఎన్నడూ చూడనటువంటి ఫీచర్లు అయినటువంటి స్పీచ్‌ టు స్పీచ్‌, స్పీచ్‌ టు టెక్ట్స్‌, టెక్ట్స్‌ టు స్పీచ్‌, టెక్ట్స్‌ టు టెక్ట్స్‌, ఆడియో నాయిస్‌ క్యాన్సిలేషన్‌, స్మార్ట్‌ రిప్లై, డిజిటల్‌ అవతార్స్‌, మరెన్నో ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

ఆన్‌పాసివ్‌ చీఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోహా ఇమామ్‌ మాట్లాడుతూ.. ''ఆట ఇప్పుడే మొదలైంది. అవును, మీరు స్పష్టంగా, బిగ్గరగా విన్నది నిజమే. తమ విప్లవాత్మక పరిష్కారాల ద్వారా ఆన్‌పాసివ్‌, డిజిటల్‌ ప్రపంచంలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. ఇంటర్నెట్‌ భవిష్యత్‌గా ఆన్‌పాసివ్‌ నిలువనుంది. ప్రజల జీవితాలు, వ్యాపారాలను సమూలంగా మార్చడానికి ఇది ఇక్కడ ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి దారితీసే వైవిధ్యమైన డిజిటల్‌ పరిష్కారాలు పొందేందుకు సరైన ప్రాంగణం ఇది'' అని అన్నారు.

ఆన్‌పాసివ్‌ డైరెక్టర్‌ వెంకట కిళ్లి మాట్లాడుతూ.. ''మా సీఈఓ ఆష్‌ ముఫారెహ్‌ చెప్పినట్లుగా 'ఇంటర్నెట్‌ యొక్క భవిష్యత్‌ ఆన్‌పాసివ్‌'. మేము మూడు ప్రొడక్ట్‌లు ఓ-మెయిల్‌, ఓ-నెట్‌, ఓ-కనెక్ట్‌ను విడుదల చేశాము. సంప్రదాయ సోషల్‌ మీడియా వేదికలతో పోలిస్తే ఇవి విప్లవాత్మక పరిష్కారాలు. మా ఆర్‌ అండ్‌ డీ, సాంకేతిక శాఖలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మా సొల్యూషన్స్‌లోని కీలక ఫీచర్లు మార్కెట్‌ అంతరాలను పూరించనున్నాయి'' అని అన్నారు.

Next Story