క్రేజీ ఫీచ‌ర్ల‌తో న‌థింగ్ ఫోన్ 1.. గ్రాండ్ ఎంట్రీ.!

Nothing Phone 1 is a grand entry with crazy features. నెలల పాటు సాగిన నిరీక్షణకు తెరపడింది. నథింగ్‌ కంపెనీ నుంచి తొలి నథింగ్‌ ఫోన్‌ 1 భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో గ్రాండ్‌

By అంజి  Published on  13 July 2022 9:30 AM GMT
క్రేజీ ఫీచ‌ర్ల‌తో న‌థింగ్ ఫోన్ 1.. గ్రాండ్ ఎంట్రీ.!

నెలల పాటు సాగిన నిరీక్షణకు తెరపడింది. నథింగ్‌ కంపెనీ నుంచి తొలి నథింగ్‌ ఫోన్‌ 1 భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. క్రేజీ ఫీచర్లు, హాట్‌ స్పెసిఫికేషన్స్‌తో నెలల తరబడి నిరీక్షణకు తెరదించుతూ.. ఈ టెండ్రీ స్మార్ట్‌ఫోన్‌ మంగళవారం రాత్రి విపణిలోకి అడుగు పెట్టింది. యూనిక్‌ డివైజ్‌గా పేరొందిన నథింగ్‌ ఫోన్‌ 1 విభిన్నమైన డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

నథింగ్‌ కంపెనీని వన్‌ప్లస్‌ వ్యవస్థాపకుడు కార్ల్‌ పీ నెలకొల్పారు. ఈ కంపెనీ నుంచి రిలీజైన తొలి స్టార్ట్‌ఫోన్‌గా నథింగ్‌ ఫోన్‌ 1 రికార్డుకెక్కింది. ఈ ఫోన్‌ మొబైల్‌ మార్కెట్‌లో పెను సంచలనాలకు నాంది పలికేలా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌, ఓఎల్‌ఈడీ డిస్‌ ప్లే, క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌తో నథింగ్‌ ఫోన్‌ 1 మార్కెట్‌లోకి వచ్చింది. లాంచ్‌ ఈవెంట్‌లో నథింగ్‌ ఫోన్‌ 1 వివరాలను కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.

8జీబీ ర్యాం + 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్‌ ఫోన్‌ ధర రూ.32,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్‌తో రూ.35,999లకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 12జీబీ ర్యాం + 256జీబీ స్టోరేజ్‌ గల నథింగ్‌ స్మార్‌ ఫోన్‌-1 ధర రూ.38,999గా ఉంది. ఈ ఫోన్‌కు వైర్డ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంది. నోటిఫికేషన్లు, బ్యాటరీ ఇండికేటర్‌, కాల్స్‌ అలర్ట్‌లకు స్పెషల్‌ లైటింగ్‌ ప్యాటర్స్‌ క్రేజీ ఫీచర్‌గా నిలవనుంది. ట్రాన్స్‌ప్రరెంట్‌ బ్యాక్‌ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్‌ ఇంటర్ఫెస్‌తో కూడి ఎల్‌ఈడీ లైట్స్‌ స్ట్రిప్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంది.

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈ నెల 21 నుంచి నథింగ్ ఫోన్‌ 1 సాధారణ సేల్ ప్రారంభ‌మ‌వుతుంది.

Next Story