మార్స్ పై దిగిన మినీ హెలికాఫ్టర్..!

NASA's Ingenuity Helicopter Dropped On Mars' Surface Ahead Of Flight.తాజాగా నాసాకు చెందిన ఇన్‌జెన్యూయిటీ మినీ హెలికాప్ట‌ర్ మార్స్‌పై దిగింది.

By Medi Samrat  Published on  4 April 2021 11:22 AM GMT
Helicopter land on Mars

మార్స్ పైన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మార్స్ మిషన్ పై నాసా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమా కాదా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మార్స్ విషయంలో మనుషులు తెలుసుకున్నది గోరంత కూడా లేదు. ఇక నాసా ఎప్పటికప్పుడు మార్స్ మీద ప్రయోగాలను చేస్తూనే ఉంది.

తాజాగా నాసాకు చెందిన ఇన్‌జెన్యూయిటీ మినీ హెలికాప్ట‌ర్ మార్స్‌పై దిగింది. ఇంకా ఎగరడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మార్స్ మీద ఉన్న వాతావరణాన్ని తట్టుకుని నిలబడితేనే ఈ హెలీకాఫ్టర్ ఎగరగలదు. భూమి సాంద్ర‌త‌లో కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే ఉన్న మార్స్‌పై ఎగరాలంటే చాలా కష్టమే. అదే స‌మ‌యంలో భూమి గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తిలో మూడో వంతు మాత్ర‌మే మార్స్ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి ఇది ఎగ‌ర‌డానికి సాయం చేయ‌నుంది. తొలి ప్ర‌య‌త్నంలో భాగంగా ప‌ది అడుగుల మేర పైకి ఎగిరి, 30 సెక‌న్ల పాటు అక్క‌డే ఉండి తిరిగి కిందికి దిగ‌నుంది.

ఫిబ్ర‌వ‌రి 18న మార్స్‌పై ల్యాండైన ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ కింది భాగంలో ఈ మినీ హెలికాప్ట‌ర్‌ను ఉంచారు. 47 కోట్ల కిలోమీట‌ర్ల పాటు నాసా ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌తోపాటు ప్ర‌యాణం చేసిన ఈ మినీ హెలికాప్ట‌ర్‌.. రోవ‌ర్ ఉద‌ర భాగం నుంచి మార్స్ ఉప‌రిత‌లంపైన దిగింది. ఈ రాత్రి మ‌నుగ‌డ సాగిస్తుందా లేదా అనే విషయాన్ని నాసాకు చెందిన జెట్ ప్ర‌ప‌ల్ష‌న్ లేబొరేట‌రీ నిశితంగా గమనిస్తూ ఉంది. హెలికాప్ట‌ర్ మార్స్‌పై దిగిన‌ ఫొటోను ప‌ర్సీవ‌రెన్స్ తీసింది.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప‌ర్సీవ‌రెన్స్ ప‌వ‌ర్ సిస్ట‌మ్‌ను ఉప‌యోగించుకుంటూ ఉండేది ఈ హెలికాప్ట‌ర్. అందులో నుండి బయటకు వచ్చిన తర్వాత సొంత బ్యాట‌రీ సాయంతో మ‌నుగ‌డ సాగించాల్సి ఉంటుంది. మార్స్‌పై రాత్రి వేళ‌ల్లో మైన‌స్ 90 డిగ్రీ సెల్సియ‌స్ వ‌ర‌కూ కూడా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతాయి. ఆ వాతావ‌ర‌ణంలో ఇది మ‌నుగ‌డ సాగిస్తుందా అన్నది ప్రశ్నార్థకమే..!

ఇందులోని హీట‌ర్ హెలికాప్ట‌ర్‌కు 7 డిగ్రీల ఉష్ణోగ్ర‌త వ‌ర‌కూ అందించ‌గ‌లుగుతుంది. వ‌చ్చే రెండు రోజుల పాటు ఇంజెన్యూయిటీ టీమ్ ఈ హెలికాప్ట‌ర్ సోలార్ ప్యానెల్స్‌ను చెక్ చేయ‌నుంది. ఆ త‌ర్వాత బ్యాట‌రీని రీఛార్జ్ చేసి, తొలిసారి ఎగిరే ముందు మోటార్లు, సెన్సార్ల‌ను ప‌రిశీలించ‌నుంది. ఏప్రిల్ 11న ఈ హెలికాప్ట‌ర్ తొలిసారి ఎగిరే ప్ర‌య‌త్నం చేయ‌నుంది.Next Story