సరికొత్త ఫీచర్స్‌తో.. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్
Motorola is all set to launch the Moto G62 5G today. 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు మోటరోలా సిద్ధమైంది. ఈ సరికొత్త జి62 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్
By అంజి Published on 11 Aug 2022 7:02 PM IST5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు మోటరోలా సిద్ధమైంది. ఈ సరికొత్త జి62 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 120 హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 12 5జీ బ్యాండ్స్, స్టీరియో స్పీకర్స్ లాంటి అత్యద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5జి ప్రాసెసర్ ఉంది. దీనివల్ల ఫోన్‌ని చాలా ఈజీగా స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారుల కోసం అద్భుతమైన 6.5 ఎఫ్‌హెచ్‌డి+ 120 హెచ్‌జెడ్ అల్ట్రా - స్మూత్ డిస్‌ప్లేతో వచ్చింది.
మోటో జీ62 12 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది నిజమైన 5జీ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. తద్వారా త్వరలో భారతదేశంలోని ప్రారంభించబోతున్న 5జీ నెట్‌వర్క్ వేగాన్ని సులభంగా అందుకోవచ్చు. అద్భుతమైన సౌండ్ కోసం ఇందులో డాల్బీ అట్‌మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ని రెండు వేరియంట్స్‌తో రిలీజ్ చేశారు. 6 + 128జీబీ ఫోన్ ధరని రూ. 17,999గా నిర్ణయించారు. అదే విధంగా 8 + 128జీబీ ధరని రూ. 19,999గా నిర్ణయించారు. వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్, ఈఎమ్‌ఐ లావాదేవీల ద్వారా రూ.1750 తగ్గింపు పొందవచ్చు. దీనివల్ల మొదటి వేరియంట్ ధర రూ. 16,249లకు లభిస్తుంది. రెండో వేరియంట్‌ని రూ.18,249లకు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగష్టు 19, 2022 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్-ఫంక్షన్ కెమెరా సిస్టమ్, 8 మెగాపిక్సెల్ వైడ్+ డెప్త్ కెమెరా ఉన్నాయి. వినియోగదారులు ఏ కోణం నుండి అయినా, ఏ కాంతిలోనైనా, అల్ట్రావైడ్ నుండి అల్ట్రా-క్లోజ్ వరకు ఫోటోలను తీసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. మోటో జి62 5జీ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది మిడ్‌నైట్ గ్రే మరియు ఫ్రాస్టెడ్ బ్లూ అనే రెండు ఆకట్టుకునే వేరియంట్‌లలో వస్తుంది. 19 ఆగస్టు 2022 నుండి అమ్మకాలు మొదలవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ+ 128 జీబీ మరియు 8జీబీ+ 128జీబీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.