అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను పూర్తిగా తొలగించేస్తున్న మైక్రో సాఫ్ట్..!

Microsoft Remove Adobe Flash From Windows 10 . విండోస్ 10 నుండి అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను పూర్తిగా తొలగించి వేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది.

By Medi Samrat  Published on  5 May 2021 12:29 PM GMT
Adobe Flash

విండోస్ 10 నుండి అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను పూర్తిగా తొలగించి వేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంతకు ముందు వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉన్న ఫ్లాష్ ప్లేయర్ ను కూడా జులై 2021 లోపు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను తీసేయాలని ఇంతకు ముందే మైక్రో సాఫ్ట్ సంస్థ తెలిపింది. గతేడాది అక్టోబర్ లోనే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్ సైట్ నుండి తీసివేయడం జరిగింది. ఇక కొత్త ఓఎస్ కు అప్డేట్ అయ్యే వారికి ఫ్లాష్ ప్లేయర్ ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

మైక్రోసాఫ్ట్ బ్లాగ్ కథనం ప్రకారం.. ఆ సంస్థ ఫ్లాష్ కాంపొనెంట్ ను KB4577586 ద్వారా తీసి వేయనుంది. జూన్ నెలలో ఇక అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ తో విండోస్ కు సంబంధం లేకుండా ఉండనుంది. యూజర్ల సెక్యూరిటీ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ 10, వెర్షన్ 1607, వెర్షన్ 1507 లలో ఫ్లాష్ ప్లేయర్ కనిపించదు అని అంటుండగా.. విండోస్ 8.1, విండోస్ 2012, విండోస్ ఎంబెడెడ్ 8 స్టాండర్డ్ లో సెక్యూరిటీ అప్డేట్ ను ఇవ్వనున్నారు. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ కు 2017 లోనే రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసింది. జనవరిలో మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కూడా అడోబ్ కు సపోర్ట్ ఇవ్వడం మానేసింది. ఫైర్ ఫాక్స్ వెర్షన్ 85.0 ఆఖరుగా సపోర్ట్ చేసింది. KB4577586 అప్డేట్ రాగానే.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లు అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను సపోర్ట్ చేయడం మానేశాయి. కొత్త నిబంధనలు రావడం, సెక్యూరిటీ పరంగా ఎన్నో అనుమానాలు తలెత్తడంతో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ వైపు ప్రముఖ బ్రౌజర్లు చూడడమే మానేశాయి. దీంతో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ రాను రానూ కనుమరుగవుతూ వచ్చింది.




Next Story