చాట్ జీపీటీ, బార్డ్‌కు పోటీగా.. 'లామా 2'
ఓపెన్ యొక్క చాట్ జీపీటీ.. గూగుల్ యొక్క బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా వాటికి పోటీ ఇచ్చేటందుకు మెటా కూడా రెడీ అయింది.
By అంజి Published on 19 July 2023 4:42 AM GMTచాట్ జీపీటీ, బార్డ్‌కు పోటీగా.. 'లామా 2'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అధునాతన సాంకేతిక యుగంలో ఇప్పుడొక సంచలనంగా మారింది. చూస్తుండగానే ఈ కృతిమ మేధ మన జీవితంలో అడుగుపెట్టేసింది. ఇప్పటికే ఓపెన్ యొక్క చాట్ జీపీటీ.. గూగుల్ యొక్క బార్డ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా వాటికి పోటీ ఇచ్చేటందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కూడా రెడీ అయింది. ఇందుకోసం లామా 2 పేరుతో ఓపెన్ సోర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ని రిలీజ్ చేసింది. చాట్ జీపీటీ, బార్డ్‌ల కంటే 40 శాతం ఎక్కువ డేటాతో లామా 2కి ట్రైనింగ్ ఇచ్చామని, ఆ తర్వాతే రిలీజ్ చేశామని మెటా వెల్లడించింది. ఈ సరికొత్త లామా 2 ఏఐ మోడల్ ద్వారా క్వాలిటీ సెర్చ్ రిజల్ట్స్‌ని పొందొచ్చని తెలిపింది. మనుషుల నుంచి సేకరించిన 10 లక్షల కంటే ఎక్కువ మెటా డాటాను 'లాబా 2' ఏఐ మోడల్‌లో పొందుపరిచినట్టు మెటా తెలిపింది.
దీని ద్వారా సెర్చ్ రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన అజూర్ క్లౌడ్ సర్వీసు ద్వారా 'లామా 2' ఏఐ మోడల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెటా తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది రన్ అవుతుంది. లామా 2 ఏఐ మోడల్‌ని జనంలోకి తీసుకెళ్లేందుకు మైక్రోసాఫ్ట్ తమ ప్రైమ్ పార్ట్‌నర్‌గా ఉంటుందని మెటా తెలిపింది. ఇది వరకు పరిశోధనా ప్రయోజనాల కోసం ఎంపిక చేసిన విద్యావేత్తలకు మాత్రమే లామా2ను మెటా అందించగా.. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, హగ్గింగ్ ఫేస్, ఇతర ప్రొవైడర్ల ద్వారా కూడా లామా 2ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లామా 2 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ రంగ ముఖ చిత్రాన్ని మారుస్తుందని అని ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.