మీ పనులన్నీ చేసిపెట్టే.. ఈ ఏఐ టూల్స్ గురించి మీకు తెలుసా?
చూస్తుండగానే మన జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అడుగుపెట్టింది. జ్ఞానాన్ని సంపాదించుకోవడం దగ్గరినుంచి
By అంజి Published on 9 April 2023 11:00 AM ISTమీ పనులన్నీ చేసిపెట్టే.. ఈ ఏఐ టూల్స్ గురించి మీకు తెలుసా
చూస్తుండగానే మన జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అడుగుపెట్టింది. జ్ఞానాన్ని సంపాదించుకోవడం దగ్గరినుంచి ఎన్నో పనులను ఈ ఏఐ సాధ్యం చేస్తోంది. ఇంటర్నెట్ సహాయంతో ఎన్నో ఏఐ వెబ్‌సైట్లు, అప్లికేషన్లు మనకు కావాల్సిన పనులన్నీంటినీ చిటికెలో చేసిపెడుతున్నాయి. అలాంటి కొన్ని ఏఐ వెబ్‌సైట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చాట్ జీపీటీ- ఇంటర్నెట్‌లో ఏ సమాచారం కావాలన్నా చాట్ జీపీటీ క్షణాల్లో దానిని అందిస్తుంది. మీకు కావాల్సిన టాపిక్ చెబితే కంటెంట్‌ను సృష్టిస్తుంది. దాన్ని వివిధ భాషల్లోకి అనువదిస్తుంది.
బ్రెయిన్.ఎఫ్‌ఎం- ఏకాగ్రతతో పని చేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, నిద్రిస్తున్నా.. దానికి అనుగుణంగా శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తుంది ఈ బ్రెయిన్.ఎఫ్‌ఎం.
డాల్ - ఇ- మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో.. టెక్స్ట్ రూపంలో డాల్-ఇకి తెలియజేస్తే కృతిమ మేధ ద్వారా ఆ ఇమేజ్‌ను సృష్టిస్తుంది.
గ్రామర్లీ - లెటర్స్ రాయడంలో గ్రామర్లీ సాయం చేస్తుంది. మీరు రాసే కంటెంట్‌లో తప్పులను సరి చేస్తుంది. వాక్య నిర్మాణంలో సరైన పదాల్ని సూచిస్తుంది
టోమ్- స్కూల్, ఆఫీసులో ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే.. ఆ పనిని టోమ్ చేసేస్తుంది. మీకు కావాల్సిన టాపిక్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఇన్‌ఫుట్‌గా ఇస్తే.. దానికి అనుగుణంగా ఇమేజ్ స్లైడ్స్ రూపొందిస్తుంది.
డీ-ఐడీ.కామ్ - ఈ వెబ్‌సైట్ ఫొటోలను యానిమేషన్ రూపంలోకి మారుస్తుంది. దీని ద్వారా మాట్లాడే అవతార్లను కూడా సృష్టించుకోవచ్చు. ఫొటోలను వీడియోల రూపంలోకి మార్చుకునేందుకు ఈ ఏఐ వెబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ల్యాండ్‌బాట్.ఐఓ - ఈ వెబ్‌సైట్ కొడ్‌తో పని లేకుండా అత్యంత శక్తివంతమైన చాట్‌బిల్డర్‌ని నిర్మిస్తుంది. ఇక్కడ ఎవరైనా సొంతంగా చాట్‌బాట్ సొంతంగా రూపొందించుకోవచ్చు. ఎక్కడైనా వినియోగించుకోవచ్చు.