జియో తన కస్టమర్లకు మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వనున్నట్టు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను స్టోర్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దీపావళి నుంచి ఈ క్లౌడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ సందర్భంగా ముకేష్ అంబానీ ప్రసంగించారు. తమ యూజర్ల కోసం ఏఐ ప్లాట్ ఫామ్ జియో బ్రెయిన్‌ను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ ధరకే ఏఐ సర్వీసులు అందిస్తామని తెలిపారు.
అలాగే జియో ఫోన్‌కాల్ ఏఐని డెవలప్ చేస్తున్నామని ఆకాశ్ అంబానీ తెలిపారు. ఇందులో ప్రతీ ఫోన్‌కాల్‌కు ఏఐని వాడుకోవచ్చన్నారు. ఈ టెక్నాలజీ కాల్‌ను రికార్డ్ చేసి జియో క్లౌడ్‌లో భద్రపరుస్తుందన్నారు. ''మీ సంభాషణను వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇతర భాషల్లోకి అనువదిస్తుంది. దీంతో కీలకమైన ఫక్షన్ సంభాషణలను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. వాటిని సెర్చ్ చేసి ఇతర భాషల్లోని వారికీ షేర్ చేయొచ్చు'' అని వివరించారు.