మరో మైలురాయిని అందుకున్న 'ఆదిత్య-ఎల్‌1'

తాజాగా ఆదిత్య ఎల్‌-1 మరో మైలురాయిని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 8:49 AM GMT
isro, aditya L1, solar wind, particle experiment,

మరో మైలురాయిని అందుకున్న 'ఆదిత్య-ఎల్‌1'

సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కొద్దిరోజుల క్రితం 'ఆదిత్య ఎల్‌-1'ను ప్రయోగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిత్య ఎల్‌-1 మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ (ట్విట్టర్‌) ఖాతాలో ఒక పోస్టును పెట్టింది.

ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉంటాయి. దీంట్లో ఉండే సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్‌ను సెప్టెంబరు 10న, సోలార్‌ విండ్‌ అయాన్‌ స్పెక్ట్రోమీటర్‌ ను నవంబరు 2న ఇస్రో శాస్త్రవేత్తలు యాక్టివేట్‌ చేశారు. అయితే.. ఈ రెండు పరికరాలు తమ పనిని ప్రారంభించామని వెల్లడించారు. సెన్సార్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ సెన్సర్‌ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్‌, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని ఇస్రో తెలిపింది. సౌర గాలుల లక్షణాలపై చాలా కాలంగా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయనీ.. ఈ ప్రయోగం ద్వారా వాటికి సమాధానాలు దొరికే చాన్స్ ఉందని ఇస్రో తెలిపింది.

సెప్టెంబర్‌ 2న సూర్యుడిపై అధ్యయనాల కోసం ఈ ఆదిత్య ఎల్‌-1 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్‌1 పాయింట్లో ప్రవేశపెట్టాలి. దీని కోసం విన్యాసాలను జనవరి 7వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఇస్రో చైర్మన్.

Next Story