రూ.50,000కే ఐఫోన్ 16.. అంత తక్కువకు ఎలా అంటే?
ఐఫోన్ 16ను ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో కొనుగోలు చేయవచ్చు. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులో ఉంది.
By అంజి Published on 22 Sep 2024 8:00 AM GMTరూ.50,000కే ఐఫోన్ 16.. అంత తక్కువకు ఎలా అంటే?
ఐఫోన్ 16ను ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో కొనుగోలు చేయవచ్చు. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులో ఉంది. వీటిలో Apple స్వంత స్టోర్ లో మాత్రమే కాకుండా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సైట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. BigBasket, Zepto, Blinkit వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా కొత్త ఐఫోన్‌ను 10 నిమిషాల్లో డెలివరీని అందిస్తున్నాయి.
Flipkart లో ఆకర్షణీయమైన ఆఫర్ తో కొనుక్కోవచ్చు. ప్రత్యేకించి iPhone 12, iPhone 13, iPhone మోడల్‌ల నుండి అప్‌గ్రేడ్ చేసే వినియోగదారుల కోసం మంచి ఆఫర్ ను అందిస్తోంది. మీరు iPhone 13 నుండి iPhone 16కి అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తూ ఉంటే Flipkart రూ. 28,500 ఎక్స్చేంజ్ విలువను అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఈ విలువ మీ iPhone 13 ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 16 ధర రూ. 51,000కి దొరుకుతుంది. iPhone 12 ఎక్స్ ఛేంజ్ విలువ రూ. 20,000 గా చెప్పొచ్చు. Apple అధికారిక స్టోర్ లో iPhone 13 కు రూ. 25,000 మాత్రమే అందిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే Flipkart ఆఫర్ బెటర్ అని అనుకోవచ్చు. ఇక మీరు ఐఫోన్ 14, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం.. 30 వేలకు కూడా ఐఫోన్ 16 ను సొంతం చేసుకోవచ్చు.