గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
By అంజి
గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్‌ను గమనించామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) తెలిపింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ ఇవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశం ఉందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారి కోడ్‌ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించవచ్చని వెల్లడించింది. హెచ్చరిక ప్రకారం.. ఎక్కువగా డెస్క్‌టాప్ గూగుల్ క్రోమ్ వినియోగదారులు ఈ సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Google Chrome వెర్షన్‌ను ఎలా తనిఖీ చేయాలి?
మీ Google Chrome బ్రౌజర్ ఏ వెర్షన్‌లో పనిచేస్తుందో తనిఖీ చేయడానికి, మీరు క్రింద పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.
క్రోమ్ బ్రౌజర్‌లో కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయడం ద్వారా 'సెట్టింగ్‌లు'కు వెళ్లండి. 'సహాయం' ఎంపికను చేరుకోవడానికి కనిపించే డ్రాప్-డౌన్ మెనులో క్రిందికి స్క్రోల్ చేయండి. 'సహాయం' ఎంపికపై కర్సర్‌ను ఉంచండి, ఇది ప్రత్యేక ఉప-మెనూను తెరుస్తుంది. ఆ ఉప-మెనూలో, 'గూగుల్ క్రోమ్ గురించి' ఎంచుకోండి. దీన్ని ఎంచుకున్న తర్వాత, కొత్త ట్యాబ్ తెరవబడుతుంది, ఇది Google Chrome ప్రస్తుతం పనిచేస్తున్న వెర్షన్‌ను ప్రదర్శిస్తుంది.