మీ ఫోన్‌లో 4G స్పీడు పెంచుకోండిలా..!

Improve Your 4G LTE Speed. మీ ఫోన్‌లో 4జీ వేగాన్ని మెరుగుపర్చడానికి కొన్ని పద్దతులు తెలుసుకుంటే 4జీ సేవలను మెరుగు పర్చుకోవచ్చు.

By Medi Samrat  Published on  12 March 2021 9:44 AM IST
Improve Your 4G LTE Speed

ప్రస్తుతం ప్రపంచం దృష్టి రాబోయే 5జీపైనే ఉంది. మన దేశంలోమాత్రం చాలా ప్రాంతాల్లో సరిగ్గా 4జీ కూడా రాదు. ఒక వేళ వచ్చినా అది స్పీడు ఉండదు. ఉన్న 4జీ కూడా స్పీడు రాకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మొబైల్‌లో 4జీ డేటా స్పీడ్‌ ఎందుకు రావడం లేదో ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం

మన మొబైల్‌ స్పీడ్‌ అనేది మీరు మొబైల్‌ టవర్‌ నుంచి ఎంత దూరంలో ఉన్నారు.. ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్‌ టవర్‌ను ఉపయోగిస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా..? అనే దానిపై ఆధారపడి పని చేస్తుంది. మామూలుగా రాత్రి సమయంలో డేటా స్పీడ్‌ తక్కువ రావడం గమనించవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో మన మొబైల్‌లో ఉండే నెట్‌ వర్క్‌ సిగ్నల్‌ సెట్టింగ్‌ కారణంగా కూడా డేటా స్పీడ్‌ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా 4జీఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ల సంఖ్య రోజురోజుకు పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ అనేది పరిమిత పరిధిలో స్పెక్టమ్‌ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్‌లో 4జీ వేగాన్ని మెరుగుపర్చడానికి కొన్ని పద్దతులు తెలుసుకుంటే 4జీ సేవలను మెరుగు పర్చుకోవచ్చు.

- ముందుగా మీ ఫోన్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి మొబైల్‌ నెట్‌ వర్క్‌ల ద్వారా 4జీను ఎనేబుల్‌ చేయండి.

- మీ ఫోన్‌ నెట్‌ వర్క్‌ సెట్టింగ్‌కు వెళ్లి యాక్సెస్‌ పాయింట్‌ పేర్లను క్లిక్‌ చేసి ఏపీఎన్‌ను డిఫాల్టుగా రీసెట్‌ చేయండి.

- కొన్ని అవసరం లేని యాప్స్‌ ఇంటర్నెట్‌ వేగాన్ని తగ్గిస్తాయి.

- వాటిని ఆన్‌ ఇంస్టాల్‌ చేయడం లేదా బ్యాక్‌ గ్రౌండ్‌ డేటా ఆప్షన్‌ నిలిపివేయడం ఉత్తమం.

- 4 జీ ఇంటర్నెట్‌ సరిగ్గా రాని సందర్భంలో ఒకసారి ఫోన్‌ ఆఫ్ చేసి ఆన్‌ చేయడం ఎంతో మంచిది. కొన్నిప్రత్యేక సందర్భాలలో మీ నెట్‌ వర్క్‌ సెట్టింగ్‌ను రీసెట్‌ చేయడం మంచిది.


Next Story