ప్లిఫ్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్.. ఐఫోన్‌లపై బంపర్ ఆఫర్

Huge discount on iPhone 11, iPhone 12 on Flipkart. కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇదే కరెక్ట్ టైమ్. జులై 6 నుంచి జులై 10 వరకూ ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్‌

By అంజి  Published on  7 July 2022 11:35 AM GMT
ప్లిఫ్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్.. ఐఫోన్‌లపై బంపర్ ఆఫర్

కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇదే కరెక్ట్ టైమ్. జులై 6 నుంచి జులై 10 వరకూ ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా ఐఫోన్- 11, ఐఫోన్- 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ సిటీ బ్యాంక్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా వస్తోంది. అలాగే సిటీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.2000 అదనపు డిస్కౌంట్, పలు ఆఫర్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్-11 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.47,999కి అందుబాటులో ఉంది. 64 జీబీ మోడల్ రూ.42,999కి ప్లిఫ్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మరో రూ.10,000కు లభిస్తుండగా ఐఫోన్-11 దాదాపు రూ.30,000కు లభిస్తోంది. ప్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-12పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.54,999 నుంచి లభిస్తుండగా సిటీ బ్యాంక్ కార్డుల ద్వారా అదనంగా రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే రూ.42,000కే ఐఫోన్-12ను కొనుగోలు చేయవచ్చు. పొకో, మోటో, వివో వంటి ఇతర బ్రాండ్ ఫోన్లపై కూడా ప్లిఫ్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ నెలాఖరులో మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ రాబోతోంది.

Next Story