సీక్రెట్‌ కెమెరాలను ఇలా గుర్తించండి

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో నేరాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి.

By అంజి  Published on  11 Oct 2024 7:07 AM GMT
secret cameras, hotels, shopping malls

సీక్రెట్‌ కెమెరాలను ఇలా గుర్తించండి

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో నేరాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కెమెరాలను హోటల్స్‌, వాష్‌రూమ్స్‌, హాస్టల్స్‌, ట్రయల్‌ రూమ్స్‌ ఇలా ఎక్కడపడితే అక్కడ పెట్టి, వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు ఆ రూమ్‌లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించాలి. మొబైల్‌ ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌లతో సీక్రెట్‌ కెమెరాలు గుర్తించవచ్చు. ఇందుకోసం గదిలో లైట్లన్నీ ఆర్పేసి మొత్తం చీకటి అయ్యాక ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయాలి. గదిలో రహస్య కెమెరాలు ఉంటే అవి ఎరుపు లేదా ఆకుపచ్చ ఎల్‌ఈడీ రంగులో మెరుస్తాయి.

హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ యాప్‌లు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు సీక్రెట్‌ కెమరాలు వైఫై నెట్‌వర్క్‌తో కూడా పని చేస్తుంటాయి. అవి రికార్డ్‌ చేసే వీడియోను వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్‌ చేస్తుంటాయి. ఏదైనా అనుమానాస్పద నెట్‌వర్క్‌ కనిపిస్తే.. దానిపై హోటల్‌ యజమాన్యాన్ని ప్రశ్నించవచ్చు. సీక్రెట్‌ కెమెరాలు డేటాను ప్రసారం చేస్తే.. అవి రేడియో ఫ్రీక్వెన్సీలను రిలీజ్‌ చేస్తాయి. ఆర్‌ఎఫ్‌ డిటెక్టర్‌ యాప్‌లు ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో సహాయపడతాయి. అలాగే రెస్ట్‌రూం, డ్రెస్‌ ఛేంజింగ్‌ రూమ్‌కు వెళ్లినప్పుడు ఆ గది మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Next Story