వామ్మో.. 19 లక్షల మంది యూజ‌ర్ల డేటా లీక్‌..!

Hacker Leaks 1.9 Million User Records of Free Online Photo Editing App Pixlr.తాజాగా ఫోటో ఎడిటింగ్ పిక్స్‌‌ల‌ర్ యాప్ హ్యాకింగ్‌కు గురైంది. ఆ యాప్‌కు చెందిన 19 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల డేటాను షైనీహంట‌ర్స్ అనే హ్యాక‌ర్ లీక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2021 10:47 AM GMT
Hacker Leaks 1.9 Million User Records

గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో ర‌కాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏ యాప్ ప‌డితే.. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేశారో మ‌న ప‌ని గోవిందా. అందుక‌నే యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసేముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే.. మన ప్రైవ‌సీకి భంగం వాటిల్లిక త‌ప్ప‌దు. ఫ్రీగా వ‌స్తుంది క‌దాని మ‌నం యాప్‌ల‌ను వాడామో.. మ‌న డేటా కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇటీవ‌ల హ్యాక‌ర్లు కొన్ని యాప్‌ల‌ను టార్గెట్ చేసి అందులోని యూజ‌ర్ల డేటాను కాజేస్తున్నారు.

తాజాగా ఫోటో ఎడిటింగ్ పిక్స్‌‌ల‌ర్ యాప్ హ్యాకింగ్‌కు గురైంది. ఆ యాప్‌కు చెందిన 19 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల డేటాను షైనీహంట‌ర్స్ అనే హ్యాక‌ర్ లీక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. యూజ‌ర్ల‌కు చెందిన ఈ-మెయిల్ అడ్ర‌స్‌లు, లాగిన్ పేర్లు, ఎస్‌హెచ్ఏ-512 హ్యాష్ పాస్‌వ‌ర్డ్‌లు లీకైన డేటాలో ఉన్నాయి. పిక్స్‌‌ల‌ర్ నుంచి డేటాను షైనీహంట‌ర్స్ చోరీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 123‌rf స్టాక్ ఫోటో సైట్ నుంచి హ్యాక‌ర్ ఆ డేటాను చోరీ చేశారు.

123rf స్టాక్ ఫోటో సైట్‌లోకి ప్రవేశించినప్పుడు పిక్స్‌లర్ నుండి డేటాబేస్‌ను దొంగిలించినట్లు షైనీహంటర్స్ చెబుతోంది. ఇన్మాగిన్ అనే సంస్థ పిక్స్‌లర్ మరియు 123 ఆర్ఎఫ్ రెండింటినీ కలిగి ఉంది. గ‌తంలో షైనీ హంట‌ర్స్ అనేక కంపెనీల‌పై హ్యాకింగ్‌కు పాల్ప‌డ్డాయి. టోకోపీడియా, హోమీచెఫ్‌, మింటెడ్‌, చాట్‌బూట్స్‌, డేవ్‌, ప్రోమో, మాత్‌వే, వాట్‌ప్యాడ్ లాంటి కంపెనీల‌ను హ్యాక్ చేశారు. AWS బకెట్ నుండి డేటాను డౌన్‌లోడ్ చేసినట్టు హ్యాకర్ చెబుతుండగా.. డేటా లీక్‌పై పిక్స్ఎల్ఆర్ ఇంకా స్పందించలేదు.
Next Story