ఆ అదిరిపోయే ఫీచర్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి రాబోతోంది.!

గూగుల్ సంస్థ తన సర్కిల్‌ సెర్చ్ ఫీచర్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా విస్తరించాలని అనుకుంటూ ఉంది

By Medi Samrat  Published on  18 Sep 2024 10:45 AM GMT
ఆ అదిరిపోయే ఫీచర్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి రాబోతోంది.!

గూగుల్ సంస్థ తన సర్కిల్‌ సెర్చ్ ఫీచర్‌ను ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా విస్తరించాలని అనుకుంటూ ఉంది. జనవరి 2024లో ఈ ఫీచర్ ను ప్రారంభించారు, మొదట Samsung Galaxy S24 సిరీస్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత Google, Samsung స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకంగా సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోందని లీక్ లు అందాయి.

Google లోని సెర్చ్ టు సర్కిల్ ఫీచర్.. విజువల్-సెర్చ్ టూల్. దీని ద్వారా వినియోగదారులు దేనినైనా సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన వివరాలను చూసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితం, వెబ్‌లో త్వరితగతిన సెర్చ్ చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ Samsung, గూగుల్ Pixel ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది త్వరలో ఇతర బ్రాండ్స్ కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కనిపించనుంది. Google దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆండ్రాయిడ్ వినియోగదారులు OnePlus, Oppo, Xiaomi, Motorola లాంటి ఇతర బ్రాండ్‌ల డివైజ్ లు ఈ ఫీచర్ ను పొందడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని మాత్రం ప్రచారం సాగుతూ ఉంది.

Next Story