లోగోను పునరుద్ధరించిన గూగుల్..పదేళ్ల తర్వాత సాలిడ్ లుక్‌

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత తన 'G' లోగోను పునరుద్ధరించింది.

By Knakam Karthik
Published on : 13 May 2025 11:33 AM IST

Tech News, Google, Logo Change, AI Features, Gradient Design, Google Redesign

లోగోను పునరుద్ధరించిన గూగుల్..పదేళ్ల తర్వాత సాలిడ్ లుక్‌

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత తన 'G' లోగోను పునరుద్ధరించింది. పాత లోగోలో ఉన్న‌ట్లు ఇక‌పై నాలుగు సాలిడ్ రంగులు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం బాక్సులుగా ఉండ‌వు. బ‌దులుగా ఎరుపు ప‌సుపు రంగులోకి, ప‌సుపు ఆకుప‌చ్చ రంగులోకి, ఆకుప‌చ్చ నీలం రంగులోకి మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

కొత్త లుక్: తేడా ఏమిటి?

మనం సంవత్సరాలుగా చూస్తున్న ఫ్లాట్, బ్లాక్ రంగులకు బదులుగా, నవీకరించబడిన 'G' లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిళితం చేసే ప్రవణతను కలిగి ఉంది. ఇది ఐకాన్‌కు మరింత ఆధునిక మరియు డైనమిక్ లుక్‌ను ఇస్తుంది, ఇది Google యొక్క అభివృద్ధి చెందుతున్న డిజైన్ భాష మరియు డిజిటల్ గుర్తింపుతో మరింత సమలేఖనం చేయబడినట్లు అనిపించేలా రూపొందించబడింది.

గూగుల్‌లో మ‌రికొన్ని ఏఐ (AI) ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నందున కంపెనీ కొత్త గ్రేడియంట్ డిజైన్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు స‌మాచారం. నివేదిక ప్రకారం ఈ అప్‌డేట్ ప్రస్తుతం iOS, పిక్సెల్ పరికరాల్లో కనిపిస్తోంది. అలాగే గూగుల్‌ యాప్ బీటా వెర్షన్ 16.18 క‌లిగిన ఆండ్రాయిడ్‌ పరికరాల్లో కూడా కనిపిస్తోంది.

అయితే, గూగుల్ ప్రధాన వర్డ్‌మార్క్‌లో కంపెనీ ఇంకా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, గూగుల్ తన ఉత్పత్తులలో ఏఐకు ప్రాధాన్యత ఇస్తున్నందున, భవిష్యత్తులో గ్రేడియంట్ డిజైన్‌ను ఇతర సేవలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. 2015 తర్వాత గూగుల్ తన ‘G’ లోగోను మొదటిసారిగా మార్పులు తీసుకొచ్చింది.

Next Story