క్లౌడ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చిన గూగుల్‌

Google brings world’s first laptops built for cloud gaming. టెక్ దిగ్గజం గూగుల్‌.. Acer, ASUS, Lenovoతో సహా తయారీదారులు తయారు చేసిన క్లౌడ్ గేమింగ్ కోసం

By అంజి  Published on  12 Oct 2022 5:34 AM GMT
క్లౌడ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చిన గూగుల్‌

టెక్ దిగ్గజం గూగుల్‌.. Acer, ASUS, Lenovoతో సహా తయారీదారులు తయారు చేసిన క్లౌడ్ గేమింగ్ కోసం రూపొందించిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రోమ్‌బుక్‌లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త క్రోమ్‌బుక్‌లు గేమింగ్ హార్డ్‌వేర్ ఫీచర్‌లు, క్లౌడ్ ద్వారా అత్యాధునిక గ్రాఫిక్స్‌తో సరికొత్త గేమ్‌లకు యాక్సెస్, గేమింగ్‌ను వేగంగా, సులభంగా చేయడానికి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లను అందిస్తాయి. ''క్రోమ్‌బుక్‌లు ఎల్లప్పుడూ వేగవంతమైనవి, సురక్షితమైనవి. ఇవి ఉపయోగించడానికి సులభమైన పరికరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఒక దశాబ్దం క్రితం ప్రారంభించినప్పటి నుండి మేం వాటి సామర్థ్యాలను మెరుగుపరిచాము. ప్రజలు ఎంచుకోవడానికి వివిధ రకాల పరికరాలను విస్తరించాము.'' అని కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.

"ఈ రోజు మా పార్టనర్స్‌ Acer, ASUS, Lenovoతో కలిసి క్లౌడ్ గేమింగ్ కోసం రూపొందించిన ప్రపంచంలోని మొట్టమొదటి ల్యాప్‌టాప్‌లను పరిచయం చేయడం ద్వారా మేము ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నాము" అని తెలిపింది. గూగుల్‌ కంపెనీ మూడు కొత్త క్రోమ్‌బుక్‌లను తీసుకొచ్చింది. అవి Acer నుండి Chromebook 516 GE, ASUS నుండి Chromebook Vibe CX55 Flip, Lenovo నుండి Ideapad Gaming Chromebook. ఈ ల్యాప్‌టాప్‌లు 120Hz+ క్రిస్టల్ క్లియర్ విజువల్స్ కోసం హై-రిజల్యూషన్ స్క్రీన్‌లు, అదనపు వేగం, యాంటీ-ఘోస్టింగ్ సామర్థ్యాలతో ఆర్‌జీబీ గేమింగ్ కీబోర్డ్‌లు (ఎంపిక చేసిన మోడల్‌లలో), వైఫై 6 లేదా 6ఈతో సహా గేమింగ్‌కు గొప్ప ఫీచర్లతో లోడ్ చేయబడ్డాయి.

అన్ని క్లౌడ్ గేమింగ్ క్రోమ్‌బుక్‌లు పనితీరు ప్లాట్‌ఫారమ్ గేమ్‌బెంచ్ ద్వారా స్వతంత్రంగా పరీక్షించబడి ధృవీకరించబడిందని గూగుల్ తెలిపింది.

Next Story