2 మిలియన్ విమాన గంటల మైలురాయిని చేరుకున్న జీఈ ఏరోస్పేస్ GEnx ఇంజిన్

GEnx కమర్షియల్ ఏవియేషన్ ఇంజన్ వర్గం దక్షిణా సియా ఎయిర్‌లైన్స్‌తో రెండు మిలియన్ విమాన గంటల మైలురాయిని సాధించిందని జీఈ ఏరోస్పేస్ నేడి క్కడ ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2024 11:30 AM GMT
2 మిలియన్ విమాన గంటల మైలురాయిని చేరుకున్న జీఈ ఏరోస్పేస్ GEnx ఇంజిన్

న్యూదిల్లీ, ఇండియా, సెప్టెంబర్ 2024 – తన GEnx కమర్షియల్ ఏవియేషన్ ఇంజన్ వర్గం దక్షిణా సియా ఎయిర్‌లైన్స్‌తో రెండు మిలియన్ విమాన గంటల మైలురాయిని సాధించిందని జీఈ ఏరోస్పేస్ నేడి క్కడ ప్రకటించింది. మొదటి GEnx 2012లో 90 GEnx ఇంజిన్‌లతో ఈ ప్రాంతంలో డెలివరీ చేయబడింది, ఇప్పుడు ఎయిర్ ఇండియా, విస్తారా, బిమాన్ బంగ్లాదేశ్ విమానాలకు ఇది శక్తినిస్తోంది.

“GEnx ఇంజన్ దక్షిణాసియా విమానయాన వృద్ధికి తోడ్పాటు అందించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ మైలురాయి దాని ఇంజనీరింగ్ నైపుణ్యం, సాంకేతిక పరిపక్వతకు నిదర్శనం” అని న్యూదిల్లీ పర్యటన సంద ర్భంగా జీఈ ఏరోస్పేస్‌ కమర్షియల్ ప్రోగ్రామ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయర్ అన్నారు. ‘‘మేం మా అత్యుత్తమ సాంకేతికత, సేవల ఆఫర్లతో మా కస్టమర్ల వ్యాపార లక్ష్యాలకు మద్దతునిస్తూనే ఉన్నాం.’’ అని అన్నారు.

40 GEnx ఇంజిన్‌లతో నడిచే 20 కొత్త వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కార్యకలాపాలను విస్తరించాలని యోచి స్తున్న ఎయిర్ ఇండియాతో సహా దక్షిణాసియా ఎయిర్‌లైన్స్‌తో మా సుదీర్ఘ సంబంధాల గురించి మేం గర్వి స్తున్నాం అని జీఈ ఏరోస్పేస్ సౌత్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ రాయ్ అన్నారు.

"మా వైడ్-బాడీ కార్యకలాపాలను విస్తరించే దిశగా మా ప్రయాణంలో జీఈ ఏరోస్పేస్ విశ్వసనీయ భాగస్వామి గా ఉంది. GEnx ఇంజిన్ విశ్వసనీయత, సామర్థ్యం, సుస్థిరత్వం పరంగా నిలకడగా అందించబడింది" అని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ అన్నారు. ‘‘మేం మా ఫ్లీట్‌ను అభివృద్ధి చేయడం కొనసాగిస్తున్నందున, మా కార్యాచరణ లక్ష్యాలను సాధించడంలో మాకు సహాయం చేయడంలో GEnx ఇంజిన్ కీలక పాత్ర పోషిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

విశ్వసనీయ, సుస్థిర సాంకేతికత

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్స్ కోసం ఒక ప్రాధాన్య ఎంపికగా, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, 747-8కి శక్తినిస్తున్న GEnx ఇంజన్ ప్రొపల్షన్ టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతోంది. ఇంజిన్ అత్యుత్తమ పని తీరు తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ కు దోహదం చేస్తుంది. ఇది అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ సుస్థిరత్వ లక్ష్యాలకు అనుగుణంగా 15% ఎక్కువ శక్తి ఆదాతో, ఇంతకు ముందున్న CF6 ఇంజిన్ కంటే 15% వరకు తక్కువ CO2 విడుదల చేస్తుంది. GEnx ఇంజిన్ అనేది GE90 ఇంజిన్ నుండి పొందిన దశాబ్దాల కార్యాచరణ జ్ఞానం, అనుభవం ఉత్పాదన. తన వినూత్న ట్విన్-యాన్యులర్ ప్రీ-స్విర్ల్ (TAPS) కంబస్టర్‌తో, ఇంజిన్ నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) ఉద్గారాలను ప్రస్తుత నియంత్రణ పరిమితుల కంటే 60% వరకు గణనీయంగా తగ్గిస్తుంది.

బెంగళూరులోని జీఈ ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌లోని పరిశోధకులు, ఇంజనీర్లు ప్రాంతీయ కొనుగోలుదారు లతో సన్నిహితంగా కలసి పనిచేశారు. వివిధ పనితీరు మెరుగుదల పరిష్కారాలను అమలు చేశారు. ఇంజిన్ పని చేసే సమయాన్ని మెరుగుపరచడానికి, నిర్వహణ భారాన్ని తగ్గించడానికి ఫోమ్ వాష్, అడ్వా న్స్ బ్లేడ్ ఇన్‌స్పెక్షన్, ఆపరేషనల్ డేటా-బేస్డ్ ఇన్‌సైట్స్ వంటి అనేక వినూత్న ఆన్-వింగ్ టెక్నాలజీలను అమలు చేశారు.

2023 మార్చిలో, GEnx ఇంజిన్‌లు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF)ని ఉపయోగించి భారత దేశానికి సుదూర మార్గంలో మొట్టమొదటి వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు శక్తినిచ్చాయి. విస్తారా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ నుండి న్యూ దిల్లీకి 30% SAF సంప్రదాయ జెట్ ఇంధనం మిశ్రమంతో ప్రయాణించింది.

ఇంజిన్ సామర్థ్యాన్ని, సుస్థిరత్వాన్ని మరింత మెరుగుపరచడానికి, జీఈ ఏరోస్పేస్ 360 ఫోమ్ వాష్‌ను ప్రవే శపెట్టింది. ఇది సంప్రదాయ వాటర్ వాషింగ్ పద్ధతులకు అత్యాధునిక ప్రత్యామ్నాయం. ఈ అధునాతన శుభ్ర పరిచే ప్రక్రియ. దుమ్ము, చెత్తను తొలగించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నిర్వహణ కాల వ్యవధుల మధ్య సమయాన్ని పొడిగించడం ద్వారా సరైన ఇంజిన్ పనితీరును నిర్వహించడానికి సహాయ పడుతుంది. ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్‌ లైన్స్, ఖతార్ ఎయిర్‌ వేస్, రాయల్ జోర్డానియన్, సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, స్కైవెస్ట్ సహా ఏడు విమానయాన సంస్థలు 360 ఫోమ్ వాష్‌ను ఇప్పటికే అమలు చేశాయి. క్షేత్రస్థాయిలో కస్టమర్లతో వేలాది ఫోమ్ వాష్‌లు నిర్వహించబడ్డాయి, నిర్వహణ ఖర్చులు, పర్యావరణ ప్రభావం మరింత తగ్గింది.

ఏఐతో సేవ నాణ్యతను మెరుగుపరచడం

సర్వీస్ లో ఉన్న తన GEnx వాణిజ్య ఇంజిన్లను జీఈ ఏరోస్పేస్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సేవ నాణ్యతను మెరుగుపరచడానికి ముందస్తు నిర్వహణ చర్యలను గుర్తించడంలో సహాయపడటానికి డిజిటల్ ఇన్ సైట్స్ ను ఉపయోగిస్తుంది. ఈ ప్రయత్నానికి మద్దతుగా, కంపెనీ అధునాతన కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ఆధారిత నమూనాలను ఉపయోగిస్తుంది, ఇది మరింత ఎక్కువ కచ్చితత్వంతో పర్య వేక్షించబడే పరిస్థితుల సంఖ్యను పెంచుతుంది. జీఈ ఏరోస్పేస్ ఏఐతో శక్తివంతమైన బ్లేడ్ ఇన్‌స్పెక్షన్ టూల్ (BIT) సాంకేతిక నిపుణుల వేగవంతమైన, మరింత కచ్చితమైన తనిఖీలకు సంబంధించి GEnx కమర్షి యల్ ఇంజిన్‌లో స్టేజ్ 1 మరియు 2 హై ప్రెజర్ టర్బైన్ ఇంజిన్ బ్లేడ్ ఇమేజ్‌ల ఎంపికకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇది నిలకడతో కూడిన చిత్రాలను పొందడంలో సహాయపడుతుంది, ఇది ప్రిడిక్టివ్ మోడల్‌లను రూపొందించ డంలో కీలకమైన ఇన్‌పుట్.

Next Story