రూ.10 వేల లోపే శాంసంగ్ 5జీ ఫోన్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌ భారత్‌లో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

By అంజి  Published on  1 March 2025 3:13 PM IST
Samsung, Galaxy F06, 5G Smartphone

రూ.10 వేల లోపే శాంసంగ్ 5జీ ఫోన్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌ భారత్‌లో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 06 పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఖరీదు రూ.10 వేల లోపే కావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్‌ అప్డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 90Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. మీడియా టెక్‌డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా, 5000 ఎంహెచ్‌ బ్యాటరీ ఉంది.

వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌తో

25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్‌ చేస్తుంది. బహమా బ్లూ, లిట్‌ వయలెట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ రిపిల్‌ గ్లో ఫినిష్‌తో వస్తోంది. ఫోన్‌పై లైట్‌ పడినప్పుడు అది మెరుస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో వస్తోంది. ఇందులో శాంసంగ్‌ వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ ఉంది. తద్వారా కాల్స్‌ మాట్లాడేటప్పుడు బయటి శబ్దాలు వినపడకుండా నిరోధిస్తుంది. మొత్తం 12 5జీ బ్యాండ్లకు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందని శాంసంగ్‌ కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తుంది. 4జీబీ+128జీబీ ధర రూ.9,999 కాగా, 6జీబీ + 128 జీబీ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. రూ.500 ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Next Story