ఎగిరే టాక్సీ వచ్చేస్తోంది..

Flying taxis in IIT Madras. ఐఐటీ మద్రాస్ లో పుట్టిన 'ద ఈ ప్లేన్ కంపెనీ' సృష్టించిన ఫ్లయింగ్ ట్యాక్సీ వివరాలివి. అది ఒక బుజ్జి టాక్సీ. ఇలా బుక్ చేస్తే అలా మన ఇంటి డాబాపై వచ్చి వాలుతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 9:18 AM IST
Flying taxis

వెహికల్ లో కూర్చుని కాస్త రిలాక్స్ అయ్యేలోగా గమ్యానికి చేరిపోతాం. సౌండ్ రాదు… పొల్యూషన్ ప్రశ్నే లేదు. ఇంత చేసి అది ఒక బుజ్జి టాక్సీ. ఇలా బుక్ చేస్తే అలా మన ఇంటి డాబాపై వచ్చి వాలుతుంది. మనల్ని ఎక్కించుకుని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇదంతా ఏ సినిమాలో సీను కాదు. ఐఐటీ మద్రాస్ లో పుట్టిన 'ద ఈ ప్లేన్ కంపెనీ' సృష్టించిన ఫ్లయింగ్ ట్యాక్సీ వివరాలివి.

పట్టణ ప్రయాణీకులను తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానాలను చేర్చేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఈ ఫ్లయింగ్​ టాక్సీలు సాధారణ టాక్సీలతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలవు. ఒక్కసారి దీన్ని ఛార్జ్​ చేస్తే మొత్తం 200 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు. ఫుల్​ ఛార్జింగ్​తో దాదాపు 10 నుండి 20 ట్రిప్పులు చేయగలిగే సామర్థ్యం వీటికి ఉందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపారు. ఈ ఏడాది జులైలోనే దాని ట్రయిల్ప వెర్షన్రీ పరిక్షించి, తుది ప్రొటోటైప్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఫ్లయింగ్ ట్యాక్సీకి రన్ వేలు అవసరం లేదని, నిట్టనిలువుగా ఎగురుతుందని, అదే నిట్ట నిలువుగానే ల్యాండ్ అవుతుందని ఆయన తెలిపారు. నగరాల్లో వాయు మార్గాలకు సంబంధించి పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. అంతేగాకుండా ఆయా చోట్ల హెలిప్యాడ్ల నిర్మాణంపైనా కసరత్తులు చేస్తామన్నారు. వాస్తవానికి ముగ్గురు లేదా నలుగురు పట్టేలా ట్యాక్సీని రూపొందించాలనుకున్నట్టు చక్రవర్తి వివరించారు. తమ ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించి సాంకేతికంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు.

అయితే, ప్రారంభంలో దీని ప్రయాణానికి కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ.. టాక్సీల సంఖ్య పెరిగే కొద్ది ఖర్చు తగ్గించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో వీటి ప్రయాణ ఛార్జీలు ఇతర యాప్​ -ఆధారిత టాక్సీ సర్వీసులతో సమానంగా ఉంటాయని పేర్కొన్నారు.


Next Story