మీరు మొబీక్విక్ యాప్ వినియోగదారులా.. అయితే మీకొక షాకింగ్ న్యూస్..!

MobiKwik users data hacked. మొబీక్విక్‌ కు చెందిన లక్షలమంది మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేశారు హ్యాకర్లు.

By Medi Samrat  Published on  30 March 2021 9:02 AM GMT
Mobikwik data hacked

మీరు మొబీక్విక్ యాప్ ను వినియోగించారా.. అయితే మీకొక షాకింగ్ న్యూస్..! ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్‌ కు చెందిన లక్షలమంది మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేశారు హ్యాకర్లు. ఈ డేటా మొత్తాన్ని డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారు. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు, సీసీ డేటా ఉన్నాయని అంటున్నారు.

సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు తెలిపారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్‌ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్‌లో ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి బయటపెట్టారు. ఫిబ్రవరి 26 న 11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు.

మొబీక్విక్‌కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను డార్క్ వెబ్ లో అమ్మనున్నారు. మరోహ్యాకర్ ఇలియట్‌ హ్యాండర్సన్‌ కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ డేటా లీక్ పై మొబీక్విక్ సంస్థ స్పందించాల్సి ఉంది. ఇలా హ్యాకైన డేటాతో చాలా పనులే చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.


Next Story