కొత్త ఏడాది.. లేటెస్ట్ ఐఫోన్ బంపర్ ఆఫర్!
కొంతమంది న్యూ ఇయర్ రోజున కొత్త ఫోన్ కొనడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అలా మీరూ ఫోన్ కొనాలని చూస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా?
By అంజి Published on 31 Dec 2024 10:39 AM ISTBumper offer, iPhone 15, New Year, Apple phones
కొంతమంది న్యూ ఇయర్ రోజున కొత్త ఫోన్ కొనడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అలా మీరూ ఫోన్ కొనాలని చూస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను తక్కువ ధరకు కొనొచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 అసలు ధర 128 జీబీ వేరియంట్‌కు రూ.69,900లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్‌వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.57,999 ధరతో లిస్ట్ అయ్యింది. అన్ని ఇతర కలర్ వేరియంట్‌లు రూ.58,999 వద్ద ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు.
బ్రాండ్, మోడల్ ఆధారంగా..
ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ.వెయ్యి బ్యాంక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్టయితే ఆ ఫోన్ ద్వారా రూ.6 వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనసూ ఉంటుంది. ఆ రెండు ఆఫర్ల తర్వా, ఫోన్ ప్రభావంతమైన ధర రూ.50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 15 స్పెక్స్:
ఐఫోన్ 15 6.1అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో యాపిల్ బయోనిక్ ఎ16 చిప్‌సెట్ ఉంటుంది. ఇది 5 కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్‌లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫొటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది.