యాపిల్ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే

యాపిల్ సంస్థ నుండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కారు

By Medi Samrat  Published on  24 Jan 2024 8:44 AM GMT
యాపిల్ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే

యాపిల్ సంస్థ నుండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కారు త్వరలోనే రోడ్ల మీద పరుగులు పెట్టనుంది. ప్రాజెక్ట్ టైటాన్ అనే కోడ్ నేమ్ ఉన్న ఈ కారు 2028కి విడుదలవ్వనుంది. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కు అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కారు స్టీరింగ్ వీల్ లేని స్వయంప్రతిపత్త వాహనం. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక అవాంతరాలను ఎదుర్కొంది. 2021 నుంచి యాపిల్ వైస్-ప్రెసిడెంట్ కెవిన్ లించ్ ప్రాజెక్ట్ టైటాన్‌కు నాయకత్వం వహించాక, అప్పటినుంచి కంపెనీ ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రణాళికలో మార్పులు చేశారు. డ్రైవర్ ప్రమేయం లేకుండా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అమర్చే పనిని ప్రారంభించారు. టెస్లా కార్లలో ఉండే ఆటోపైలట్ సిస్టమ్‌ను పోలి ఉండేలా డ్రైవర్లు అవసరమైన సమయంలో కారును నియంత్రించగలిగేలా ఈ కారును రూపొందించనున్నారు.

వేగంగా మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యాపిల్ తన ఈవీలో కొత్త ఫీచర్లను అమర్చేందుకు విడుదలను పొడిగించింది. ఆపిల్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లించ్ 2021 నుండి ప్రాజెక్ట్ టైటాన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. యాపిల్ సంస్థ ఈ కారుకు ఎంత రేటు పెడుతుందో అనే విషయమై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.


Next Story