రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం, కౌంట్‌డౌన్
ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 11:50 AM ISTరేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం, కౌంట్‌డౌన్
ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో మరింత స్పీడ్‌ను పెంచింది. కీలక ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను మన వైపు చూసేలా చేస్తోంది. తాజాగా ఇస్రో ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం ద్వారా సూర్యగోళం రహస్యానలు చేధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శ్రీహరి కోట వేదికగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్న ఆవిష్కరించనుంది ఇస్రో.
సెప్టెంబర్ 1న ఉదయం 11.50 గంటలకు మొదలైన కౌంట్ డౌన్.. 24 గంటల పాటు కొనసాగనుంది.. ఆ తర్వాత PSLVC-57 రాకెట్ ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పటికే PSLVC-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్, ఆయన బృందం.. ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆ తర్వాత శ్రీహరికోటకు చేరుకున్నారు ఇస్రో చైర్మన్ డా. సోమనాథ్. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వమించారు. రాకెట్‌లోని వివిధ విభాగాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.
చంద్రుడిపై వాతావరణం నార్మల్‌గానే ఉంటుంది.. కానీ.. సూర్యుడు అలా కాదు. మండే అగ్నిగోళం. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యి.. దాని పని కూడా ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సంబంధించిన ఫొటోలను ఇస్రో విడుదల చేస్తూనే ఉంది. ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్య వరకే సాగనుంది. ఆ కక్ష్యలో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది ఇస్రో. దీని ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై అధ్యయనం చేయబోతున్నారు.