తాజాగా సౌర వ్యవస్థ వైపు భారీ వేగంతో దూసుకొస్తున్న ఓ తొకచుక్కును కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. దీనిని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి, గ్యారీ బెర్న్‌ స్టెయిన్‌లు మొదటగా గుర్తించారు. ఈ తోకచుక్కకు C/2014UN271 అనే పేరును శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ తోకచుక్క పరిమాణం మార్స్‌ గ్రహానికి చెందిన పోబోస్‌, డిమోస్‌ ఉపగ్రహాల కంటే పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్కగా నిలిచింది. శాస్త్రవేత్తలు దీనిని పరిమాణాన్ని మొదటగా 200 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.

మొదటగా దీనిని ఒక ఆస్ట్రరాయిడ్‌ గుర్తించిన శాస్త్రవేత్తలు..ఈ తర్వాత అబ్జర్వేటరీ అందించిన నివేదిక ప్రకారం తోకచుక్కగా నిర్దారించారు. ఈ భారీ తొకచుక్కకు సంబంధించిన పర్యవేక్షణను సెర్రో టోలోలో గల ఇంటర్ - అమెరికన్‌ అబ్జర్వేటరీలో ఉన్న డార్క్ ఎనర్జీ సర్వే దారా పరిశీలిస్తున్నారు. దీని గమనాన్ని శాస్ర్తవేత్తలు ఎప్పటికప్పుడూ అంచనా వేస్తున్నారు. 2031వ సంవత్సరంలో ఈ తోక చుక్క సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకావం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ తోకచుక్క వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story