కంపెనీ సీఈవోగా 'రోబో'.. షాక్‌లో ఉద్యోగులు

A humanoid robot as the CEO of a Chinese company. తాజాగా ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌తో నడిచే హ్యూమనైడ్‌‌‌‌ (మనిషి రూపంలోని) రోబోను ఓ చైనీస్ కంపెనీ తమ సీఈఓగా నియమించుకుంది.

By అంజి  Published on  9 Sep 2022 9:03 AM GMT
కంపెనీ సీఈవోగా రోబో.. షాక్‌లో ఉద్యోగులు

ఇప్పటి వరకు కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న మనుషుల్ని చూశాం. ఇకపై అలా కాదట. మనుషుల స్థానంలో రోబోలు వస్తాయట. కొన్ని కంపెనీలు తమ సీఈవోల కుర్చీలో రోబోలను కూర్చొబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌తో నడిచే హ్యూమనైడ్‌‌‌‌ (మనిషి రూపంలోని) రోబోను ఓ చైనీస్ కంపెనీ తమ సీఈఓగా నియమించుకుంది. రోబోల వల్ల ఇప్పటికే వేల కొద్ది కింది స్థాయి ఉద్యోగాలు మెషిన్ల పరమవుతున్నాయి. ఇప్పుడు కంపెనీ బాస్‌‌‌‌ల ఉద్యోగాలు కూడా ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో రోబోల చేతికి చేరొచ్చని దీని చూస్తే అర్థమవుతోంది.

మెటావర్స్‌‌‌‌ కంపెనీ ఫుజియన్‌‌‌‌ నెట్‌‌‌‌డ్రాగన్‌‌‌‌ వెబ్‌‌‌‌సాఫ్ట్‌‌‌‌ తాజాగా ఏఐతో పనిచేసే హ్యూమనైడ్‌‌‌‌ రోబో (పేరు ఎంఎస్‌‌‌‌ టాంగ్‌‌‌‌ యు) ని రోటేటింగ్‌‌‌‌ సీఈఓగా నియమించింది. కంపెనీ పని సామర్ధ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ పదవి కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోగా టాంగ్ యు రికార్డులకు ఎక్కింది. మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లను క్రియేట్ చేసే ఈ కంపెనీ వాల్యూ సుమారు రూ. 80 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇకపై కింది స్థాయి ఉద్యోగులపై రోబో అజామాయిషీ చెలాయించనుంది. రోబో సీఈవో రావడంపై ఉద్యోగులు షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కంపెనీ ఆన్‌లైన్‌ గేమ్‌లను కూడా తయారు చేస్తుంది. ఇంత పెద్ద కంపెనీని రోబో చేతిలో పెట్టడం విశేషం. అయితే కంపెనీ సీఈవో ఎలాంటి విధులు నిర్వర్తిస్తారో.. అలాంటి పనులను రోబో చేయదు. కానీ సంస్థకు నాయకత్వం వహించడానికి, వర్చువల్‌ సీఈవో పని చేసేందుకు పూర్తిగా ఫంక్షనల్‌ డ్యూటీలో ఉంచబడుతుంది. సీఈవోగా టాంగ్ యు.. కంపెనీ 'ఆర్గనైజేషనల్ అండ్ ఎఫిషియెన్సీ డిపార్ట్‌మెంట్'ను లీడ్ చేయనుంది. రోబో సీఈవోను చూసి చైనా ఉద్యోగులు.. ఆనందపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.

Next Story