సైన్స్‌కు అంతు చిక్కని 5 ప్రశ్నలు ఇవే

భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాల మీద కూడా వేరే ప్రాణులు ఉన్నాయని చాలా మంది

By అంజి  Published on  26 Feb 2023 7:29 PM IST
సైన్స్‌కు అంతు చిక్కని 5 ప్రశ్నలు ఇవే

1. ఏలియన్స్ : భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాల మీద కూడా వేరే ప్రాణులు ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. మన దేశంలోకి కొన్ని సంఘటనల ఆధారంగా గ్రహాంతర వాసులు వచ్చి వెళ్తున్నారనే ప్రచారం ఉంది. అయితే శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా నిరూపించలేదు.

2. దెయ్యాలు / పునర్జన్మ: తీరని కోర్కెలతో చనిపోయిన మనిషి దెయ్యం అవుతాడని అంటారు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కచ్చితంగా పునర్జన్మ ఉంటుందని కూడా నమ్ముతారు. వారు చేసిన కర్మలను బట్టి మళ్లీ మనిషిగానో, పశు పక్షాదులుగానో జన్మిస్తారని చెప్తారు. కానీ దీంట్లో ఏది వాస్తవం అనేది సైన్సు ఇంకా తేల్చలేదు. దెయ్యాలు,పునర్జన్మపై భిన్న వాదనలు ఉన్నాయి.

3. మరణం: పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే. అయితే మనిషిని మరణం నుంచి దూరం చేయడానికి చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మానవుడు మరణం లేకుండా జీవించగలడా అనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు. మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందనేదానిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు.

4. విశ్వం: మనిషి పుట్టుకకు ముందు విశ్వంలో ఓ విస్పోటనం కారణంగా భూమి ఏర్పడింది. ఆ తర్వాత మానవాళి పుట్టింది అని అంటారు. అయితే ఈ విస్పోటనం ఎందుకు జరిగింది? అంతకు ముందు విశ్వంలో ఎవరు ఉండేవారు అనే విషయాలను ఎవరూ తేల్చలేదు.

5. కలలు: నిద్రలో కలలు రావడం చాలా సహజం. మనకు ఉండే కోర్కెలే కలల రూపంలో వస్తాయని ‘ఫ్రాయిడ్’ అనే శాస్త్రవేత్త చెప్పాడు. కానీ కొన్నిసార్లు మనకు సంబంధం లేని సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. అవి ఎందుకు వస్తాయనేది మాత్రం సైన్స్ వివరించలేదు. మనకు వచ్చిన కొన్ని కలలు ఎందుకు మర్చిపోతాం, కొన్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటాం అనేది కూడా చెప్పలేదు. డ్రీమ్స్ విషయంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి.

Next Story