చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన..16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది.

By Knakam Karthik
Published on : 20 Jun 2025 9:03 AM

Techonology News, Data Breach, Password Leak, Cyber Security, Google, Apple, Facebook, Data Security,

చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన..16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 16 బిలియన్ల (1600 కోట్లు) లాగిన్ ఆధారాలు, పాస్‌వర్డ్‌లతో సహా లీక్ అయినట్లు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు ధ్రువీకరించారు. ఈ సమాచార లీకేజీతో యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్‌హబ్, టెలిగ్రామ్‌తోపాటు వివిధ ప్రభుత్వ సేవలతో సహా ఊహకందని అనేక ఆన్‌లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టేనని ఫోర్బ్స్ నివేదిక హెచ్చరించింది.

ఇటీవల రక్షణ లేని వెబ్ సర్వర్‌లో 184 మిలియన్ల రికార్డులతో కూడిన ఒక ‘రహస్య డేటాబేస్’ ఉందంటూ పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది. అయితే, అది కేవలం మంచుకొండ కొన మాత్రమేనని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. పరిశోధకులు ఇప్పటివరకు 30 డేటాసెట్‌లను కనుగొన్నారని, ఒక్కోదానిలో 3.5 బిలియన్ల వరకు రికార్డులు ఉన్నాయని ఫోర్బ్స్ పేర్కొంది. 2025 ప్రారంభం నుంచి కొనుగొన్న ఈ డేటాసెట్‌లలో సోషల్ మీడియా, వీపీఎన్ లాగిన్‌లతో పాటు కార్పొరేట్, డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన సమాచారం కూడా ఉంది.

పరిశోధకులు మాట్లాడుతూ “ఇది కేవలం ఒక లీక్ మాత్రమే కాదు, భారీ స్థాయిలో దుర్వినియోగానికి ఇదొక బ్లూప్రింట్. ఇవి పాత ఉల్లంఘనల నుంచి రీసైకిల్ చేసిన డేటా కాదు. ఇది ఆయుధంగా మార్చగల నిఘా సమాచారం” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో లాగిన్ ఆధారాలు లీక్ అవ్వడం వల్ల ఫిషింగ్ ప్రచారాలు, అకౌంట్ల టేకోవర్‌లు, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) దాడులకు ఆస్కారం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

లీక్ లోపల ఏముంది?

లీకైన డేటాలో గూగుల్, ఫేస్‌బుక్ మరియు టెలిగ్రామ్ వంటి ఇమెయిల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి గిట్‌హబ్‌లోని డెవలపర్ ఖాతాలు మరియు కొన్ని ప్రభుత్వ పోర్టల్‌ల వరకు విస్తృత శ్రేణి సేవల లాగిన్ సమాచారం ఉంటుంది. చాలా సమాచారం వెబ్‌సైట్ లింక్‌ను చూపించే ఫార్మాట్‌లో నిర్వహించబడుతుంది, తరువాత వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్ ఉంటుంది, దీని వలన దాడి చేసేవారు ఉపయోగించుకోవడం సులభం అవుతుంది.

Next Story