యోగి సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

By సుభాష్
Published on : 20 Jan 2020 6:49 PM IST

యోగి సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అలహాబాద్‌ నగరం పేరును ప్రయాగరాజ్‌గా మార్పు చేస్తూ సీఎం యోగి తీసుకున్న నిర్ణయంపై ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగిఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పరిధిలోని రైల్వేస్టేషన్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర కేంద్ర సంస్థల పేర్లను మార్చే హక్కు లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు.

500 ఏళ్ల నాటి మొఘల్‌ రాజు అక్బర్‌ పెట్టిన అలహాబాద్‌ నగర పేరును ప్రయాగరాజ్‌గా బీజేపీ ప్రభుత్వం ఎలా మారుస్తుందని ప్రశ్నించారు. అక్బర్‌ పెట్టిన ఈ పేరును మార్చడం చరిత్రను వక్రీకరించడమేనని పిటిషనర్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 1575లో మొఘల్‌ రాజు అలహాబాద్‌ అని నామకరణం చేశారని అన్నారు.

Next Story