నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 6:03 AM GMT
నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం

కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్‌ ముందుకు వచ్చింది. 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి జులై 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో రెజ్యుమ్‌తో పాటు వయస్సు, గుర్తింపు, ధృవీకరణ పత్రాలు అనుభవంకు సంబంధించిన సరిఫ్టికేట్స్ ను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది.

కాగా.. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి 100 మార్కులకు ఇంటర్య్వూలను నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగం లభించనుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్‌ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి.

Next Story