ఢిల్లీ:లాభాలతో ఎస్‌బీఐ అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,375.40 కోట్ల ఏకీకృత లాభాన్ని ఆర్జించింది. గత 576.46కోట్ల నికర లాభంతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. గతేడాది జులై – సెప్టెంబర్‌లో 944.87 కోట్ల నికర లాభం నమోదు చేయగా..ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభం 3,011.91 కోట్లు. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.79, 302, 72 కోట్లుగా నమోదైంది. ఇక..నిరర్ధక ఆస్తులు తగ్గాయి. గత ఏడాది 9.95 శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు 7.19 శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి పరిమితం అయ్యాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.