ఎస్బీఐ కస్టమర్లకు న్యూఇయర్‌ గిఫ్ట్ ఇదే..!

By సుభాష్  Published on  30 Dec 2019 1:14 PM GMT
ఎస్బీఐ కస్టమర్లకు న్యూఇయర్‌ గిఫ్ట్ ఇదే..!

దేశంలో అతితపెద్ద బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు న్యూ ఇయార్‌ సందర్భంగా శుభవార్త వినిపించింది. బ్యాంక్‌ తాజాగా ఎక్స్‌ టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత రేటును 25 బేసిక్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ కీకల నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రేటు 8.05 శాతం నుంచి 7.8 శాతానికి దిగొచ్చింది. ఇక ఈబీఆర్‌ రేటు తగ్గింపు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఇంటి రుణంపై వడ్డీ రేటు తగ్గిపోనుంది. అలాగే ఎక్స్‌ టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లోన్‌ తీసుకునే ఎంఎస్‌ఎంఈలకు కూడా తక్కువ వడ్డీకే లోన్స్‌ లభించనున్నాయి.

ఇక కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి 7.9 శాతం వడ్డీ రేటు వర్తించనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇది వరకు ఈ వడ్డీరేటు 8.15 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఎక్స్‌ టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేటు ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుందని తెలిపింది. రెపోరేటు ఇప్పుడు 5.15 శాతం ఉంది.

ఇక ఎస్బీఐ ఇంటి రుణం ఇచ్చేటప్పుడు ఆర్బీఐ రెపో రేటుకు 265 పాయిట్లను యాడ్‌ చేసుకొని ఎక్స్‌ టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ రేటును నిర్ణయిస్తుంది. 10బేసిక్‌ పాయింట్ల నుంచి 75 బేసిక్‌ పాయింట్ల వరకు చార్జీలను కూడా వసూలు చేస్తుంది. ఇవ్వన్నీ కలుపుకొని ఇంటి రుణం పై వడ్డీ అనేది నిర్ణయిస్తారు.

Next Story
Share it